స్వర్ణ దేవాలయాన్ని టార్గెట్ చేసిన పాక్!

పహల్గామ్ లో పర్యాటకులపైన ఉగ్రవాదులు విరుచుకుపడి మరణ హోమం సృష్టించి 26 మంది ప్రాణాలు తీసిన ఘటన తర్వాత మోడీ సర్కార్ ఆపరేషన్ సిందూర్ తో ఉగ్రవాదులను అణిచివేయడానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇక ఆపరేషన్ సిందూర్ ను జీర్ణించుకోలేక పోయిన పాకిస్తాన్, మన దేశం పైన దాడి చేయడానికి డ్రోన్లను, క్షిపణులను ఉపయోగించి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిన సంగతి కూడా తెలిసిందే.

అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయం టార్గెట్
పాకిస్తాన్ మన దేశంపైన దాడికి చేసిన అన్ని ప్రయత్నాలను భారత భద్రత దళాలు తిప్పికొట్టిన విషయం ప్రతి ఒక్కరికి విధితమే. అయితే ఈ క్రమంలో తాజాగా పాకిస్తాన్ మన దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుందని కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అమృత్ సర్ లో ఉన్న స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుందని మేజర్ జనరల్ కార్తీక్ సి శేషాద్రి వెల్లడించారు.

Pakistan targeted the Golden Temple Conspiracy foiled by Indian Army

పాక్ దాడుల యత్నాన్ని తిప్పికొట్టిన భారత్
పాక్ దాడుల యత్నాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టామని కూడా ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ పైన దాడులు చేయడానికి పాకిస్తాన్ తెగబడుతుందని భారత సైన్యం ముందే అంచనా వేసింది. మిలట్రీ ని టార్గెట్ చేయడంతో పాటుగా పౌరులకు సంబంధించిన సదుపాయాలు, మతపరమైన ప్రాంతాల పైన టార్గెట్ చేసే అవకాశం ఉందని భావించారు.

గోల్డెన్ టెంపుల్ టార్గెట్.. అదనపు భద్రత కల్పించిన ఆర్మీ
పాకిస్తాన్ కు ఎటువంటి ఖచ్చితమైన లక్ష్యాలు లేవని, ఎక్కడ సాధ్యమైతే అక్కడ విధ్వంసం సృష్టించి భారత పౌరులకు నష్టం చేసే ప్లాన్ చేసిందని భావించారు. ఇక ఈ క్రమంలోనే పాకిస్తాన్ గోల్డెన్ టెంపుల్ ను టార్గెట్ చేసిందని గుర్తించారు. ఈ క్రమంలో గోల్డెన్ టెంపుల్ కు ఎటువంటి హాని జరగకుండా అదనపు రక్షణ కల్పించినట్టు గా, గోల్డెన్ టెంపుల్ రక్షించడం కోసం పూర్తిగా సిద్ధమైనట్లుగా ఆయన పేర్కొన్నారు.

స్వర్ణ దేవాలయంపై చిన్న గీత కూడా పడకుండా రక్షణ
మన ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ గన్నర్స్ పాకిస్తాన్ సైన్యం ప్రణాళికలను తిప్పి కొట్టిందని మేజర్ జనరల్ వెల్లడించారు. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్ , క్షిపణులను ఎక్కడికక్కడ ధ్వంసం చేశామని స్వర్ణ దేవాలయం పైన ఒక గీత కూడా పడకుండా కాపాడగలిగాము అని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+