Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అన్నాడీఎంకే పార్టీ కథ క్లైమాక్స్ కు: ఢిల్లీకి సీఎం పళని, పన్నీర్: శశికళకు అక్కడే చెక్ !

అన్నాడీఎంకే పార్టీలో శశికళ కథ క్లైమాక్స్ కు చేరుకుంది శశికళకు ఢిల్లీలో చెక్, ముహూర్తం ఫిక్స్ చేసిన పళని, పన్నీర్ ఢిల్లీ వెళ్లిన పళనిసామి, పన్నీర్ సెల్వం. పదవి, పార్టీ చిహ్నం మాదే

చెన్నై/న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీలో శశికళ కథ క్లైమాక్స్ కు చేరుకుంది. చిన్నమ్మ శశికళను సాగనంపేందుకు సెప్టెంబర్ 12వ తేదీ ముహుర్తం ఖరారైంది. సెప్టెంబర్ 12వ తేదీన అన్నాడీఎంకే పార్టీ కార్యవర్గ, సర్వసభ్య సమావేశం నిర్వహించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నిర్ణయించారు.

సెప్టెంబర్ 12వ తేదీన శశికళను పార్టీ నుంచి శాశ్వతంగా తప్పించి అదే రోజు పార్టీ ప్రధాన కార్యదర్శిని ఎంపిక చేసుకోవడమే ప్రధాన ఉద్దేశం అని నాయకులకు సూచించారు. ఈ సందర్బంలో శశికళకు ఢిల్లీలో చెక్ పెట్టాలని సీఎం ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నిర్ణయించారు.

Palanisamy and Panneerselvam go Delhi get back Twin Leaves

మంగళవారం ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వంతో పాటు ఐదు మంది మంత్రులు ఢిల్లీ చేరుకుని భారత ఎన్నికల కమిషన్ కార్యాలయంలో అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళను నియమించామని గతంలో ఇచ్చిన అఫిడవిట్లను వెనక్కి తీసుకోవడానికి సిద్దం అయ్యారు.

అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోవడంతో ఎన్నికల కమిషన్ రెండాకుల చిహ్నంపై నిషేధం విధించింది. తరువాత ఎడప్పాడి పళనిసామి వర్గం అన్నాడీఎంకే అమ్మ అని, పన్నీర్ సెల్వం వర్గం అన్నాడీఎంకే పురట్చి తలైవి అమ్మ అనే పేరుపెట్టుకున్నారు. ఇప్పుడు ఇరు వర్గాలు కలిసిపోవడంతో పార్టీ లెటర్ హెడ్ లో అన్నాడీఎంకే అమ్మ, పురట్చి తలైవి అమ్మ అనే పేరుపెట్టుకుని రెండాకుల చిహ్నం సొంతం చేసుకోవడానికి పళనిసామి, పన్నీర్ సెల్వం ఢిల్లీ వెళ్లారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+