ఆర్థిక లావాదేవీలు రూ.2.5 లక్షలు దాటితే పాన్ నంబర్ తప్పనిసరి!
న్యూఢిల్లీ: రూ.2.5 లక్షలు దాటే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇకమీదట తప్పనిసరిగా పాన్ నెంబరును సమర్పించాలి. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తాజాగా ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ఈ నిబంధన అమల్లోకి తెచ్చారు.
రూ. 2.5 లక్షలు దాటే ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డ్ నెంబరు సమర్పించాలని, ఇది ప్రతి వ్యక్తికి వర్తిస్తుందని తన బడ్జెట్ ప్రసంగంలో అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనల అమలులోకి రానుంది.

మరోవైపు వ్యాపార సంస్థలకు కూడా ఆధార్ తరహాలో తప్పనిసరిగా గుర్తింపు ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా దేశంలోని అన్ని వ్యాపార సంస్థలకు విశిష్ఠ గుర్తింపు నంబర్ కేటాయించేందుకు త్వరలో ఓ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.












Click it and Unblock the Notifications