Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పనామా పేపర్స్: ఐశ్వర్యరాయ్‌ను ఐదు గంటలపాటు విచారించిన ఈడీ

న్యూఢిల్లీ: పనామా పేపర్ల వ్యవహారంపై బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఈడీ విచారణ ముగిసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను దాదాపు ఐదు గంటలపాటు విచారించారు. సోమవారం రాత్రి 8-9 గంటల ప్రాంతంలో ఐశ్వర్యరాయ్ ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు.

పనామా పేపర్లతో ఉన్న సంబంధంపై ప్రధానంగా ఈడీ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. ఫారెక్స్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఐశ్వర్యను విచారించిన అధికారులు.. ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఫెమా నిబంధనలను ఉల్లంఘించి విదేశాల్లో డబ్బు దాచుకున్నట్లు ఐశ్వర్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలోనే ఆమెను విచారించారు.

panama papers: After five hours of ED questioning, Aishwarya Rai Bachchan steps out.

అయితే, తదుపరి విచారణకు రావాలని పిలిచారా లేదా అనే అంశంపై మాత్రం ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. గతంలో కూడా రెండుసార్లు ఐశ్వర్యరాయ్ కి ఈడీ సమన్లు పంపినప్పటికీ.. ఆమె వాయిదా కోరారు. దీంతో తాజాగా, సమన్లు పంపడంతో ఆమె ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. గత 15 ఏళ్లలో విదేశాల నుంచి అందుకున్న చెల్లింపులకు సంబంధించిన రికార్డులను ఐశ్వర్యరాయ్ సమర్పించినట్లు తెలిసింది.

పార్లమెంటులో సహానం కోల్పోయిన జయాబచ్చన్, బీజేపీపై ఫైర్

సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ పార్లమెంటు సమావేశాల్లో సహనం కోల్పోయారు. కేంద్ర ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టారు. ఓవైవు ఢిల్లీలో తన కోడలు (ఐశ్వర్యరాయ్ బచ్చన్)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారిస్తుండగానే రాజ్యసభలో బీజేపీపై విరుచుకుపడ్డారు జయాబచ్చన్. బీజేపీకి త్వరలోనే చెడ్డరోజులు రాబోతున్నాయని శాపనార్థాలు పెట్టారు.

తన కుటుంబంపై బీజేపీ ఎంపీలు అనుచిత వ్యాఖ్యలు చేశారని జయాబచ్చన్ మండిపడ్డారు. విపక్షాలు మాట్లాడకుండా కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను బీజేపీ ఎంపీలు వ్యక్తిగతంగా టార్గెట్‌ చేయడం సరికాదంటూ మండిపడ్డారు. రాజ్యసభలో ఐశ్వర్యారాయ్‌ పేరును బీజేపీ ఎంపీలు ప్రస్తావించడంపై ఆవేశంతో ఊగిపోయారు జయాబచ్చన్‌. కాగా, పనామా పేపర్స్‌లో ఐశ్వర్యారాయ్‌ పేరు బయటకు రావడంతో ఆమెను ఈడీ విచారించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+