Panama leaks: ఈడీ ముందుకు ఐశ్వర్య రాయ్.. బచ్చన్ కుటుంబానికి తప్పని కష్టాలు..?

ఢిల్లీ: అప్పట్లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులకు సంబంధించి వ్యక్తిగత ఖాతా వివరాలను వెల్లడించి పనామా పేపర్స్ సంచలనం సృష్టించింది.పనామా లీక్స్‌తో దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు, రాజకీయనాయకులు ఇతర సంపన్నులు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఇక ఈ పనామా పేపర్ కేసు గతంలో అమితాబ్ బచ్చన్ కుటుంబానికి సంబంధించిన వివరాల బాంబును కూడా పేల్చింది. దీంతో ఈడీ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్యరాయ్ ఈడీ ముందు సోమవారం హాజరుకానుంది. దీంతో బిగ్ బీ కుటుంబానికి కష్టాలు వెంటాడుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.

ఈడీ ముందుకు ఐశ్వర్య రాయ్

ఈడీ ముందుకు ఐశ్వర్య రాయ్

పనామా పేపర్ కేసుతో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కుటుంబానికి కష్టాలు తప్పేలా లేవు. గతంలో ఈడీ ఐశ్వర్య రాయ్‌కు నోటీసులు పంపింది. దీంతో ఆమె సోమవారం ఢిల్లీలోని లోక్‌నాయక్ భవన్‌లో ఈడీ ముందు హాజరు అవుతోంది. ఇప్పటికే ఐశ్వర్య రాయ్‌కు ఎలాంటి ప్రశ్నలు సంధించి వివరాలు రాబట్టుకోవాలనేదానిపై ఈడీ అధికారులు ప్రశ్నల జాబితాతో సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. పనామా పేపర్స్ కేసులో దాదాపుగా 500 మంది భారతీయుల పేర్లు వెలుగులోకి వచ్చాయి.

ఇందులో రాజకీయనాయకుల నుంచి, నటులు, సెలబ్రిటీలు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు పేర్లు ఉన్నాయి. వీరంతా పన్ను ఎగవేసినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే పలు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు రంగంలోకి దిగి కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి.

నెలరోజుల క్రితం అభిషేక్ బచ్చన్ హాజరు

నెలరోజుల క్రితం అభిషేక్ బచ్చన్ హాజరు

పనామా పేపర్ కేసులో అమితాబ్ బచ్చన్ కుటుంబ సభ్యులకు గతంలోనే నోటీసులు ఈడీ నుంచి వచ్చాయి. చాలా కాలం నుంచే పనామా పేపర్స్ కేసును విచారణ సంస్థలు విచారణ చేస్తున్నాయి . దేశంలో పలువురు ప్రముఖులు బడాబాబుల పేర్లు వెలుగులోకి రావడంతో ఈడీ వీరిపై ఫోకస్ చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ ఎపిసోడ్‌లోనే నెలరోజుల క్రితం అభిషేక్ బచ్చన్‌ ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. కొన్ని డాక్యుమెంట్లను ఈడీ అధికారులకు అందజేశాడు. త్వరలోనే అమితాబ్ బచ్చన్‌ను కూడా ఈడీ అధికారులకు విచారణకు పిలిచే అవకాశాలున్నాయనే వార్తలు వస్తున్నాయి.

బచ్చన్ కుటుంబమే ఎందుకు..?

బచ్చన్ కుటుంబమే ఎందుకు..?

2016లో పనామా నుంచి ఆపరేట్ అయ్యే ఓ లా కంపెనీకి సంబంధించి రూ.11.5 కోట్లు మేరా టాక్స్ డాక్యుమెంట్లు యూకేలో లీకయ్యాయి. ఇందులో పలువురు రాజకీయనాయకులు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖులు సెలబ్రిటీల పేర్లు వెలుగులోకి వచ్చాయి. భారత్‌లో ఇలాంటివారి పేర్లు దాదాపుగా 500 ఉన్నాయి. ఇందులో బచ్చన్ కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్నాయి.

ఓ నివేదిక ప్రకారం ఓ నాలుగు కంపెనీలకు డైరెక్టరుగా అమితాబ్‌ బచ్చన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నాలుగు కంపెనీల్లో మూడు కంపెనీలు బహామాస్, ఒకటి వర్జిన్ ఐలాండ్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ కంపెనీలను 1993లో స్థాపించినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీల క్యాపిటల్ 5వేల నుంచి 50 వేల డాలర్లుగా ఉన్నట్లు నివేదిక ద్వారా తెలుస్తోంది. ఇన్వెస్ట్‌మెంట్ తక్కువగా ఉన్నప్పటికీ బిజినెస్ మాత్రం కొన్ని కోట్లలో ఈ కంపెనీల ద్వారా జరిగేదనేది బయటపడింది. ఐశ్వర్యరాయ్ ఒక కంపెనీకి డైరెక్టరుగా ఉన్నారని ఆ తర్వాత ఆమెను షేర్‌హోల్డర్‌గా మాత్రమే డిక్లేర్ చేసినట్లు సమాచారం.

ఈ కంపెనీ పేరు అమిత్ పార్ట్‌నర్స్ ప్రైవేట్ లిమిటెడ్. దీని ప్రధాన కార్యాలయం వర్జిన్ ఐలాండ్‌లో ఉంది. ఐశ్వర్యతో పాటు ఆమె తండ్రి కె.రాయ్, తల్లి వృందా రాయ్, సోదరుడు ఆదిత్య రాయ్ కూడా ఈ కంపెనీలో భాగస్వామ్యులుగా వ్యవహరించారు. అమిత్ పార్ట్‌నర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఈ కంపెనీని 2005లో స్థాపించినట్లు తెలుస్తోంది. అయితే 2008లో ఈ కంపెనీని మూసివేసినట్లుగా ఉంది.

మొత్తానికి సోమవారం రోజున ఐశ్వర్య రాయ్ ఈడీ ముందు హాజరై వారడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెబుతుందో ఆసక్తికరంగా మారింది. ఆమె చెప్పే సమాధానాల ద్వారా మరింత మందిని ఈడీ విచారణకు పిలుస్తుందా లేక సమాధానంతో సంతృప్తి చెంది ఆమెను పంపించివేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+