లాక్కొచ్చి రేప్ చేశారు: చెప్పు దెబ్బలతో వదిలేయండని తీర్పు
ఫరీదాబాద్: హర్యానా రాష్ట్రంలో ఓ అత్యాచారం సంఘటనలో పంచాయతీ పెద్దలు విచిత్రమైన తీర్పు చెప్పారు. ఓ అమ్మాయిపై అత్యాచారం చేసిన ఇద్దరిని ఐదు సార్లు బూట్లతో కొట్టాలని పంచాయతీ పెద్దలు తీర్పు చెప్పారు. దానికి తోడు, రూ. 50,000 జరిమానా విధిచారు.
అయితే, పంచాయతీ పెద్దల తీర్పుతో ఆగ్రహం చెందిన 15 ఏళ్ల బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సంఘటన మే 15వ తేదీన జకోపూర్ అనే గ్రామంలో జరిగింది. చేతి పంపు నుంచి నీళ్లు తోడుకోవడానికి వెళ్లిన అమ్మాయిపై అత్యాచారం జరిగింది.

మునాఫత్, జబీద్ అనే ఇద్దరు నిందితులు అమ్మాయిని లాక్కొచ్చి, ఆమెపై అత్యాచారం చేశారు. విషయాన్ని ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా అమ్మాయిని వారు బెదిరించారు. అయితే, బాధితురాలు తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. వారు నిందితుల కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. దాంతో వివాదాన్ని పరిష్కరించడానికి పంచాయతీ సమావేశం జరిగింది.
సంఘటనను కప్పిపుచ్చడానికి ప్రయత్నించిన పెద్దలు నిందితులిద్దరికి రూ. 50 వేలు జరిమానా విధించి, వారిద్దరిని అయిదుసార్లు బూట్లతో కొడితే సరిపోతుందని తీర్పు చెప్పారు. అయితే, బాధితురాలి కుటుంబ సభ్యులు తీర్పును అంగీకరించకుండా, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారంనాడు పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications