జయ సమాధి వద్ద పన్నీర్ మౌనదీక్ష, శశికళపై పరోక్ష వ్యాఖ్యలు, రాజీనామా వెనక్కి తీసుకొంటా
తమిళనాడు ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా శశికళపై ఆయన విమర్శలు చేశారు. తనను అవమానపర్చారని ఆయన మనోవేదన చెందారు.
చెన్నై:తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మ ఆత్మకు శాంతి కలిగించేందుకు ప్రజలకు నిజాలు చెప్పక తప్పదని ఆయన కుండబద్దలు కొట్టారు.తనను అవమానపర్చారని ఆయన కంటతడిపెట్టారు.ముఖ్యమంత్రి పదవికి బలవంతంగా రాజీనామా చేయించారని ఆయన చెప్పారు.రాజీనామాను వెనక్కు తీసుకొనేందుకు సిద్దమని ఆయన ప్రకటించారు.

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్ద అర్థరాత్రి ఒంటరిగా 40 నిమిషాల పాటు ధ్యానం చేశాడు. తనను శశికళ అవమానించారని ఆయన ఆరోపించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రెవిన్యూ మంత్రి...... శశికళ ముఖ్యమంత్రిగా అవుతున్నారని ప్రకటించడం తనను అవమానించడమేనని చెప్పారు.
తనతో ముఖ్యమంత్రి పదవికి బలవంతంగా రాజీనామా చేయించారని ఆయన చెప్పారు. శశికళ సిఎం కావాలని మంత్రులు కోరడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.
పార్టీలో చోటుచేసుకొన్న పరిణామాలన్నింటిని వ్యతిరేకిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రజలకు నిజాలు చెప్పాలని మీడియా ముందుకు వచ్చినట్టు ఆయన ప్రకటించారు. నిజాలు చెప్పాలని అమ్మ ఆత్మ ఆదేశించిందన్నారు. ప్రజలకు నిజాలు చెప్పక తప్పదన్నారు.
ఆసుపత్రిలో అమ్మ ఉన్నప్పుడు పార్టీని రక్షించాలని తనకు సూచించిందన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా మధుసూధన్ చేయాలని జయలలిత కోరారని, అయితే తానే వద్దని చెప్పానని ఆయన ప్రకటించారు.
శశికళను అన్నాడిఎంకె పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేయాలని పార్టీ సీనియర్ నాయకుడు దివాకరన్ తనను కోరాడని ఆయన చెప్పారు.వార్థా తుఫాన్ సమయంలో తాను కష్టపడి పనిచేయడం కొందరికి నచ్చలేదని పరోక్షంగా శశికళ గ్రూప్ ను ఉద్దేశించి ఆయన విమర్శలు గుప్పించారు.
మంత్రులు తనకు వ్యతిరేకంగా మాట్లాడడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.తనను అవమానపర్చారని ఆయన చెప్పారు. ఈ పరిణామాలన్నింటిని తాను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని తనను బలవంతం చేశారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications