అన్నాడీఎంకేలో టెన్షన్ టెన్షన్: మూడు వర్గాలు పోటా పోటీ మీటింగ్, హ్యాండ్ ఇచ్చిన పన్నీర్ !
తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అన్నాడీఎంకే పార్టీలోని మూడు వర్గాల నాయకులు పోటా పోటీగా సమావేశాలు ఏర్పాటు చెయ్యడంతో ఆ వర్గాల్లోని నాయకులు,
చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అన్నాడీఎంకే పార్టీలోని మూడు వర్గాల నాయకులు పోటా పోటీగా సమావేశాలు ఏర్పాటు చెయ్యడంతో ఆ వర్గాల్లోని నాయకులు, కార్యకర్తలు ఏం చెయ్యాలో అర్థం కాక అయోమయానికి గురౌతున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ హడలిపోతున్నారు. విలీనం చర్చలకు తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం చెక్ పెట్టేశారు. అన్నాడీఎంకే (పురచ్చి తలైవి) వర్గం నాయకులు వెంటనే చర్చలు జరపడానికి చెన్నై రావాలని పన్నీర్ సెల్వం పిలుపునిచ్చారు.

మరో పక్క విలీనం చర్చల కోసం తాను పెట్టిన డెడ్ లైన్ గడువు పూర్తి అయ్యిందని శనివారం (ఆగస్టు 5వ తేదీ) చెన్నైలోని రాయపేట్ లోని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తానని, తనను ఎవరూ అడ్డుకోలేరని టీటీవీ దినకన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
టీటీవీ దినకరన్ కు చెక్ పెట్టాలని తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి, పలువురు మంత్రులు ప్రయ్నతిస్తున్నారు. దినకరన్ దూకుడుకు కళ్లెం వెయ్యాలంటే పన్నీర్ సెల్వం మద్దతు అవసరం అని పలువురు మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే పన్నీర్ సెల్వం మాత్రం తాను పెట్టిన షరతులకు ఏమాత్రం తగ్గనని అంటున్నారు.












Click it and Unblock the Notifications