వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళ పావులు: 'తన' సెంటిమెంటల్ హోటల్ తరలించి, ఫోన్లు లాక్కొని..

తమిళనాడులో అధికార పార్టీలో రాజకీయ వేడి రాజుకుంది. తొలుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, ఆ తర్వాత అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళలు మీడియాతో ఒకరిపై మరొకరు మండిపడ్డారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో అధికార పార్టీలో రాజకీయ వేడి రాజుకుంది. తొలుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, ఆ తర్వాత అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళలు మీడియాతో ఒకరిపై మరొకరు మండిపడ్డారు.

శశికళ వర్గం తమ ఎమ్మెల్యేలను బస్సుల్లో తరలించి.. చెన్నైలోని రెయిన్ ట్రీ హోటల్‌కు, ఇతర రెండు మూడు హోటళ్లకు తరలించింది. ఈ హోటల్ శశికళది. సెంటిమెంటల్‌గా దీంతో ఆమెకు బాగా అటాచ్‌మెంట్ ఉంది.

<strong>శశికళని జయ నమ్మినా.. మోడీ దెబ్బ: సంక్షోభం వెనుక పెద్ద కథే!</strong>శశికళని జయ నమ్మినా.. మోడీ దెబ్బ: సంక్షోభం వెనుక పెద్ద కథే!

రెండు మూడు హోటల్స్‌లలో ఎమ్మెల్యేలను ఉంచిన అనంతరం వారిని చెన్నైలోని పలు ప్రాంతాలకు తీసుకు వెళ్లనున్నారు. అంతేకాదు, ఈ బస్సుల్లో జయలలిత - ఎంజీఆర్ నటించిన సినిమాలు చూపిస్తారు.

Panneerselvam crisis: Sasikala shunts AIADMK MLAs to hotels

అంతకుముందు పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఎమ్మెల్యేలు హాజరుకాగానే శశికళ తన వ్యూహం అమలుచేశారు. తనకు మద్దతు తెలుపుతున్నట్టు వారి నుంచి సంతకాలు సేకరించారు.

<strong>పన్నీరుకు బెదిరింపు, అప్పుడు మద్దతు.. నవ్వడం నేరమా: స్టాలిన్</strong>పన్నీరుకు బెదిరింపు, అప్పుడు మద్దతు.. నవ్వడం నేరమా: స్టాలిన్

ఈ సంతకాలతో ఈ రోజు లేదా రేపు మద్దతుదారు ఎమ్మెల్యేలతో రాష్ట్రపతిని కలవనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలను వివిధ రహస్య ప్రాంతాలకు వారిని తరలించారు. పన్నీర్ సెల్వం, డీఎంకే, బీజేపీ వంటి పార్టీల నుంచి ఎలాంటి ఒత్తిళ్లు నెలకొనకుండా ఆమె వారి నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా, వారు నుంచి ఎలాంటి సమాచారం ఇతరులకు చేరకుండా చర్యలు చేపట్టారు. దీంతో తమిళనాట కలకలం రేగుతోంది. అధికారం కోసం శశికళ వేస్తున్న ఎత్తులు, కదుపుతున్న పావులను అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.

English summary
MLAs has been shifted to nearby hotels to ensure that no legislator switches sides and joins Chief Minister O Panneerselvam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X