పన్నీర్ సెల్వంకు భీతి: అందుకే ఢిల్లీకి పరుగో పరుగు, మోడీతో భేటీ, కేంద్రం యూటర్న్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: అన్నాడీఎంకేలోని ఇరు వర్గాల విలీన ప్రయత్నాలు విఫలం కావడంతో ఇప్పుడు రెండాకుల చిహ్నం పొందడంపై నేతలు శ్రద్ద చూపిస్తున్నారు. టీటీవీ దినకరన్ ను పార్టీకి దూరం పెట్టడంతో కొందరు ఎమ్మెల్యేలు ఎడప్పాడి పళనిసామి పట్ల విముఖతతో తిరుగుబాటు దోరణి ప్రదర్శిస్తున్నారు.

రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే:పన్నీర్, ఢిల్లీ కేంద్రంగా ఏం జరిగింది?

అధికార వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే తమిళనాడులోని ఎడప్పాడి ప్రభుత్వానికి ఏ క్షణామైనా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచానా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పన్నీర్ సెల్వం ఢిల్లీ బాటపట్టారు. కేంద్రంతో సన్నిహితంగా మెలగడానికి మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టారు.

పన్నీర్ వైపు నిలిచిన కేంద్రం !

అన్నాడీఎంకేలో విభేదాలు పొడచూపిన నాటి నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నీర్ సెల్వం వైపు నిలిచింది. శశికళ మీద పలురకాల ఒత్తిడి తీసుకు వచ్చింది. అయితే తమిళనాడు రాజకీయాల్లో కేంద్రం జోక్యం చేసుకోలేదని ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు ఖండించారు.

ఈ రెండు కారణాలు చాలు !

తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ ఆస్తులపై ఆదాయపన్ను శాఖ అధికారుల దాడులు, ఆర్ కే నగర్ ఉప ఎన్నికల రద్దు తదితర పరిణామాలు శశికళ వర్గానికి కేంద్రం వ్యతిరేకం అని ప్రజలు భావించేలా చేశాయి. ఇదే విషయం తమిళనాడులో జోరుగా ప్రచారం జరిగింది.

ఉలిక్కి పడిన పళనిసామి

ఉలిక్కి పడిన పళనిసామి

అనుకోని పరిణామాలతో ఉలిక్కిపడిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, మంత్రులు ఢిల్లీ బాటపట్టీ ప్రధాని, కేంద్ర మంత్రులను కలుసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మీకు పూర్తి మద్దతు ఇస్తామని ఢిల్లీ పెద్దలకు పళనిసామి మాట ఇచ్చారు.

కేంద్రం రివర్స్ గేర్ !

కేంద్రం రివర్స్ గేర్ !

ఈ పరిణామాలతో కేంద్ర ప్రభుత్వం ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి అండగా నిలవడం ప్రారంభించింది. ఈ విషయం నిర్దారిస్తున్నట్లుగా ఎడప్పాడి పళనిసామి సైతం రాష్ట్రంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని పొగడటం మొదలుపెట్టారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఏమీ విమర్శించరాదని మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు.

వెంకయ్యనాయుడు ఎంట్రీ

వెంకయ్యనాయుడు ఎంట్రీ

చెన్నైలో మెట్రో రైలు ప్రారంభోత్సవానికి హాజరైన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఏకంగా తమిళనాడు సచివాలయానికి వెళ్లి సమీక్ష నిర్వహించి పరోక్షంగా పన్నీర్ సెల్వం వర్గానికి షాక్ ఇచ్చారు. ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తోందని పరోక్షంగా వెలుగు చూసింది.

పన్నీర్ సెల్వం పరుగో పరుగో

పన్నీర్ సెల్వం పరుగో పరుగో

ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా ఇప్పటికే బలహీనంగా ఉన్న పన్నీర్ సెల్వం వర్గంలోలో దడపుట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సఖ్యతపై పన్నీర్ వర్గంలో భీతి నెలకొంది. తమవైపు ఉన్న కొద్ది మంది ఎంపీలు, ఎమ్మెల్యే కూడా ఎక్కడ ఎడప్పాడి పళనిసామి వైపు వెళ్లిపోతారో అనే అనుమానం తలెత్తింది.

బీజేపీ నేతలతో ఎంపీ మంతనాలు

బీజేపీ నేతలతో ఎంపీ మంతనాలు

పన్నీర్ సెల్వం వర్గంలోని ఎంపీ మైత్రేయన్ ఢిల్లీలో మకాం వేసి బీజేపీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. మోడీతో సాన్నిహిత్యం చెయ్యిజారిపోకుండా పన్నీర్ సెల్వం జాగ్రత్తపడతున్నారు. అందులో భాగంగానే తన ఢిల్లీ పర్యటన గోప్యంగా ఉంచి గురువారం అర్దరాత్రి చెన్నై నుంచి విమానంలో ఢిల్లీ చేరుకున్నారు.

అదే ఫీలింగ్ తో ఇప్పుడు

అదే ఫీలింగ్ తో ఇప్పుడు

ప్రధాని మోడీతో భేటీ అయిన పన్నీర్ సెల్వం తమిళనాడు ప్రజల అభీష్టాన్ని మన్నించి నీట్ ప్రవేశ పరీక్షను మినహాయించాలని, రైతుల వ్యవసాయ రుణాలను రద్దు చెయ్యాలని, అతివృష్టి కారణంగా అల్లాడుతున్న అన్నదాతలను ఆదుకోవాలని వినతి పత్రం సమర్పించారు.

సీఎంకు పరోక్ష హెచ్చరిక

సీఎంకు పరోక్ష హెచ్చరిక

మోడీతో కలిసిని పన్నీర్ సెల్వం తాను కేంద్ర ప్రభుత్వంతో సాన్నిహిత్యంగా ఉన్నానని, అధికారంలో ఉన్నా, లేకున్నా తమిళనాడు ప్రజల సమస్య కోసం పోరాడుతానని సీఎం పళనిసామిని పరోక్షంగా హెచ్చరించారు. కేంద్రంలోని కొందరు పెద్దలు సైతం పన్నీర్ సెల్వం వైపు మొగ్గు చూపుతున్నారని తెలిసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former Tamil Nadu Chief Minister Panneerselvam met Prime Minister Narendra Modi and raised issues concerning the state, including the release of pending funds.
Please Wait while comments are loading...