వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పన్నీర్ కు కన్నీరే:వ్యూహత్మక తప్పిదమేనా? రెబెల్ ఎంఏల్ఏలు చివరకిలా...

పన్నీర్ సెల్వం గ్రూప్ వ్యూహాత్మక తప్పిదాల వల్లే ముఖ్యమంత్రి పదవి ఆయనకు దక్కలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అన్నాడిఎంకెలో 20 మంది రెబెల్ ఎంఏల్ఏలు డిఎంకెతో టచ్ లో ఉన్నారనే ప్రచారం కూడ ఉన్న

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:తమిళనాడు ముఖ్యమంత్రి పదవి మరోసారి తన చేతుల వద్దకు వచ్చి చేజారిపోయింది పన్నీర్ సెల్వానికి. అయితే తనకు మద్దతిస్తారని భావించిన ఎంఏల్ఏలు చివరి నిమిషంలో రూటు మార్చడంతో పన్నీర్ కు కన్నీరే మిగిలింది.దీంతో పళని స్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు.

పన్నీర్ సెల్వం శశికళ వర్గం వైపు ఉన్న ఎంఏల్ఏలను తన వైపుకు తిప్పుకోవడంలో వైఫల్యం చెందారు.శశికళ గ్రూపుకు చెందిన పళని స్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాల్సిన అనివార్య పరిస్థితిని కల్పించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అన్నాడిఎంకెలో 20 మంది ఎంఏల్ఏలు శశికళకు వ్యతిరేకంగా ఉన్నారని ప్రచారం సాగింది.వీరంతా పరోక్షంగా డిఎంకెకు మద్దతిస్గున్నట్టు కథనాలు వచ్చాయి.

panneerselvam wrong strategy for cm post

అక్రమాస్తుల కేసులో శశికళకు జైలు శిక్ష పడడంతో రెబెల్ ఎంఏల్ఏలు తన గూటికి చేరుతారని పన్నీర్ సెల్వం ఆశలు పెట్టుకొన్నారు.కానీ, ఆయన ఆశలు పెట్టుకొన్నారు.

రెబెల్ ఎంఏల్ఏలలో ఎక్కువ మంది కొత్త వారే.అందుకే వారే ధైర్యం చేసి పన్నీర్ గూటికి చేరుకోలేకపోయారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారంగా ఒకవేళ తమపై వేటు పడితే తిరిగి ఎన్నికలకు వెళ్ళి గెలుపొందుతామా అనే నమ్మకం కూడ వారిలో లేదు.

ఈ కారణాలతో పన్నీర్ సెల్వం వైపుకు రెబెల్ ఎంఏల్ఏలు రాలేదనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణాలతోనే పళని స్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు దోహదపడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

English summary
panneerselvam wrong strategy for cm post. spreading a rumour around 20 rebel mlas touch with dmk.panneer stratagy didn't work.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X