పన్నీర్ సెల్వం వర్గం మళ్లీ వెనకడుగు: ఆలస్యం చేస్తే అంతే !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఆర్ కే నగర్ నుంచి ఎవ్వరిని పోటీలో నిలపాలనే విషయంపై పన్నీర్ సెల్వం వర్గం మళ్లీ పెండింగ్ లో పెట్టంది. ఆర్ కే నగర్ నియోజ వర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థిని ఇంత వరకు నిర్ణయించలేదని అంటున్నారు.

పన్నీర్ సెల్వం వర్గంలోని మాజీ మంత్రి, అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే పాండ్యరాజన్ బుధవారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో ఎవ్వరిని పోటీ చేయించాలి అనే విషయం ఇప్పటి వరకు పన్నీర్ సెల్వం నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

Pannerselvam team will announce it's candidate to R.K.Nagar with in 2 days, says Pandiarajan.

ఢిల్లీ నుంచి పన్నీర్ సెల్వం చెన్నై చేరుకున్న తరువాత అందరితో చర్చించి తగిన నిర్ణయం తీసుకుని రెండు రోజుల్లో ప్రకటిస్తారని పాండ్యరాజన్ వివరించారు. పన్నీర్ సెల్వం వర్గంలోని సీనియర్ నాయకుడు, జయలలితకు అత్యంత సన్నిహితుడు మధుసూదనన్ ఆర్ కే నగర్ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది.

అయితే మధుసూదనన్ పేరు అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించలేదు. మధుసూదనన్ పేరు ప్రకటిస్తారా? లేదా దీపా జయకుమార్ కు మద్దతు ప్రకటించి ఆమెకు ప్రచారం చేసి గెలిపిస్తారా ? అనే విషయంపై జయలలిత అభిమానుల్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tamil Nadu former CM Pannerselvam team will announce it's candidate to R.K.Nagar with in 2 days, says Pandiarajan.
Please Wait while comments are loading...