బీహర్‌కు ప్రత్యేక హోదా: లోక్‌సభలో ఎంపీ పప్పూయాదవ్ నోటీసు

న్యూఢిల్లీ:బీహర్ రాష్ట్రానికి కూడ ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌‌పై చర్చను కోరుతూ జన్ అధికార్ పార్టీ (జెఎపి) ఎంపీ పప్పూ యాదవ్ బుధవారం నాడు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటీసు ఇచ్చారు.

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై టిడిపి, వైసీపీ ఎంపీలు కేంద్రంపై అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చాయి,. అయితే ఈ నోటీసులపై ఇంతవరకు చర్చ ప్రారంభం కాలేదు. ఈ తరుణంలో బీహర్‌ రాష్ట్రానికి కూడ ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వాలనే డిమాండ్‌తో జన్ అధికార్ పార్టీ ఎంపీ పప్పూ యాదవ్ నోటీసు ఇవ్వడం సంచలనం రేపుతోంది.

Pappu Yadav gives notice in LS over special status for Bihar

రెండు రోజుల క్రితం బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 13 ఏళ్ళ క్రితమే తాను ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తిన విషయాన్ని గుర్తు చేశారు. తాను ఈ డిమాండ్‌ను విడిచిపెట్టే ప్రసక్తేలేదని ఆయన చెప్పారు.

బీహర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని తాను 2005లోనే ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
అంతేకాదు ఏడాది తర్వాత బీహర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని బీహర్ అసెంబ్లీలో కూడ తీర్మానం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా విషయమై బిజెపి నేతలు తలలు పట్టుకొంటున్న సందర్భంలో బీహర్ రాష్ట్రానికి చెందిన నేతలు కూడ ఇదే అంశాన్ని తీసుకురావడం ప్రస్తుతం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+