వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కల్నల్ సంతోష్ బాబుకు పరమవీర చక్ర..? మరో 19 మందికి కూడా..

|
Google Oneindia TeluguNews

లడాఖ్‌ సరిహద్దుల్లో గల గల్వాన్‌ లోయలో చైనా దురాక్రమణను తిప్పికొట్టే క్రమంలో వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబుకు పరమవీర చక్ర అవార్డు అందజేసే అవకాశం ఉంది. రిపబ్లిక్ డే సందర్భంగా పరమ వీర చక్ర అవార్డును ప్రకటిస్తారని విశ్వసనీయంగా తెలిసింది. యుద్ధ సమయంలో ఇచ్చే అత్యున్నత సైనిక పురస్కారం పరమవీర చక్ర అవార్డును ఇప్పటివరకు 20 మందికి మాత్రమే ఇచ్చారు. గల్వాన్‌ పోరాటంలో సంతోష్‌తోపాటు ప్రాణాలు అర్పించిన మొత్తం 19 మంది సైనికులకు, గాయపడిన మరికొంత మంది సైనికులకు అవార్డులు ప్రకటించే అవకాశం ఉంది.

సంక్రాంతి

 యుద్ద సమయంలో అందజేత..

యుద్ద సమయంలో అందజేత..

యుద్ధ సమయంలో ఇచ్చే అవార్డులనే వీరికి ఇవ్వాలని సైన్యం ఉన్నతాధికారులు సిఫారసు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. యుద్ధ సమయంలో ఇచ్చే అత్యున్నత పురస్కారాల్లో పరమవీర్‌ చక్ర, మహావీర్‌ చక్ర, వీర్‌ చక్ర ఉన్నాయి. శాంతి సమయంలో ఇచ్చే అత్యున్నత పురస్కారాల్లో అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర ఉన్నాయి. గణతంత్ర దినోత్సవానికి కొద్ది రోజుల ముందు ఈ అవార్డులను ప్రకటిస్తారు. గతేడాది జూన్‌ 15న గల్వాన్‌ లోయలో చైనా దురాక్రమణను భారత్‌ అడ్డుకొనే క్రమంలో జరిగిన భీకర పోరులో కల్నల్‌ సంతోష్‌బాబు సహా 20 మంది మరణించగా, చైనా వైపు నుంచి 35 మంది చైనా సైనికుల బాడీలను స్ట్రెచర్‌ల మీద తీసుకెళ్లారు.

హై టెన్షన్..

హై టెన్షన్..

తూర్పు లడాఖ్‌ సరిహద్దుల్లో గల గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణతో ఉద్రిక్త నెలకొంది. ఈ ఏడాది మే నెల నుంచి హై టెన్షన్ ఉంది. జూన్‌లో రాళ్లతో దాడి చేయడం.. భారత్ తరఫున 20 మంది సైనికులు చనిపోయారు. దీంతో సరిహద్దుల్లో యుద్దమేఘాలు అలుముకున్నాయి. చైనా పీపుల్స్ ఆర్మీ తరఫున కూడా 30 నుంచి 40 మంది చనిపోయారని విదేశీ మీడియా కథనాలు ప్రసారం చేశాయి. కానీ దానిని డ్రాగన్ చైనా తోసిపుచ్చింది.

కవ్వింపు చర్యలు

కవ్వింపు చర్యలు

ప్యొంగ్యాంగ్ సరస్సు సమీపంలో గల గాల్వాన్ వ్యాలీపై డ్రాగన్ చైనా కన్నుపడింది. చొచ్చుకొచ్చేందుకు విఫల ప్రయత్నం చేసింది. మే నుంచి కవ్వింపు చర్యలకు దిగింది. అదీ జూన్‌లో ఎక్కువ అవుతూ వచ్చింది. జూన్ 15వ తేదీన రాత్రి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేసింది. అయితే వారిని భారత సైనికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారితో కల్నల్ సంతోష్ బాబు‌కు వాగ్వివాదం జరిగింది. తర్వాత వీడియో కూడా బయటకు వచ్చింది. దేశం కోసం వీరోచితంగా పోరాడి.. ప్రాణాలు అర్పించిన వారికి అవార్డులను అందజేయబోతున్నారు.

English summary
paramvir chakra to colonel santosh babu on re public day. another 19 soldiers to awarded
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X