ఒక్క రాత్రికే ఇంతనా?: నటి పరిణీతి చోప్రా ఫ్లైట్ మిస్
ముంబై: బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా వెళ్లవలసిన విమానం మిస్ అయింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం రాత్రి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముంబై నగరంలో రోడ్ల పైన భారీగా నీరు చేరింది. దీంతో, ట్రాఫిక్‌కు ఇబ్బంది అవుతోంది.
ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటంతో పరిణీతి చోప్రా విమానం మిస్ అయింది. ఈ విషయమై ఆమె సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో పేర్కొంది.

తాను ట్రాఫిక్‌లో చిక్కుకు పోయానని, విమానాశ్రయానికి చేరుకోలేకపోయానని అందులో పేర్కొన్నారు. తాను ఎక్కవలసిన విమానం మిస్ అయ్యిందని చెప్పారు. ఒక్క రాత్రి కురిసిన వర్షానికి ఇంత ట్రాఫిక్ జాం అంటూ వర్ష ప్రభావం ఫోటోను ట్విట్టర్‌లో ఉంచింది.
ముంబైలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు నెల రోజుల తర్వాత భారీగా వర్షాలు వస్తున్నాయి. దీంతో ముంబైలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. రైళ్లు పైనా కూడా వర్షం ప్రభావం పడింది.












Click it and Unblock the Notifications