వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీ అభివృద్ధిని అడ్డుకోవడమే పరివాడీలు చేసే పని: ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలపై ప్రధాని మోడీ ఫైర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆరు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. మరో ఏడో దశ ఎన్నికలు మరో మూడు రోజుల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనర మిర్జాపూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడారు.

Recommended Video

UP Elections 2022 : UP Has A Biggest Responsibility Making India Powerful - Modi | Oneindia Telugu

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులతో సహా పౌరులందరినీ తీసుకురావడానికి భారత ప్రభుత్వం పగలు రాత్రి కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 'ఆపరేషన్ గంగా'తో ఉక్రెయిన్ నుంచి వేలాది మంది చిన్నారులను సురక్షితంగా తీసుకొచ్చామని మిర్జాపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన అన్నారు.

Pariwarwadis Put Obstacles In UPs Development, Didnt Let The Poor Progress: PM Modi.

మిర్జాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఇప్పటివరకు జరిగిన ఆరు దశల పోలింగ్‌లో బీజేపీ, ఎన్డీఏల సుపరిపాలనకు ఉత్తరప్రదేశ్ అత్యధికంగా ఓటేసిందన్నారు.

'ఇప్పుడు మీర్జాపూర్, భదోహి, పూర్వాంచల్ ప్రాంతం వంతు వచ్చింది. 'ఘోర్ పరివార్వాడీలు' (వారసత్వ రాజకీయాలు), మాఫియాలను మళ్లీ ప్రతిధ్వనించే రీతిలో ఓడించండి' అని ప్రధాని నొక్కి చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం దృష్ట్యా పరిస్థితి గురించి మాట్లాడుతూ... "ప్రపంచం మొత్తం ఈ శతాబ్దంలో చాలా క్లిష్టమైన కాలంలో ఉంది. మహమ్మారి, అశాంతి, అనిశ్చితి నేడు ప్రపంచంలోని అనేక దేశాలను ప్రభావితం చేస్తున్నాయి' అని అన్నారు.

"సంక్షోభం ఎంత లోతుగా ఉన్నప్పటికీ, భారతదేశం ప్రయత్నాలు మరింత గొప్పవి, మరింత దృఢంగా ఉన్నాయని ప్రధాని మోడీ చెప్పారు. 'ఆపరేషన్ గంగా' లో భాగంగా రెస్క్యూ పనుల గురించి కూడా ఆయన మాట్లాడుతూ.. "ప్రస్తుతం, ప్రపంచం మొత్తం ఉక్రెయిన్‌లో సంఘర్షణ పరిస్థితిని చూస్తోంది. చిక్కుకున్న ప్రతి పౌరుడిని, మన విద్యార్థులను తిరిగి తీసుకురావడానికి భారతదేశం పగలు రాత్రి శ్రమిస్తోందని ప్రధాని మోడీ తెలిపారు.

'ఆపరేషన్ గంగా'తో ఉక్రెయిన్ నుంచి వేలాది మంది చిన్నారులను సురక్షితంగా తీసుకొచ్చాం. ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. 'ఆపరేషన్ వందే భారత్', 'ఆపరేషన్ దేవి శక్తి'లను కూడా గుర్తు చేసుకున్నారు. "కోవిడ్ కాలంలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భారతీయులు చిక్కుకుపోయారు. వందే భారత్ ఆపరేషన్ ద్వారా తిరిగి రావడానికి భారతదేశం పౌరులందరికీ సహాయం చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌లో వేలాది మంది భారతీయులు కష్టాల్లో ఉన్నారు, కాబట్టి మేము ఆపరేషన్ దేవి శక్తి ప్రారంభించాము. చాలా మంది భారతీయులను సురక్షితంగా తరలించాము' అని ప్రధాని మోడీ వివరించారు.

అభివృద్ధి పనుల్లో పరివార్‌వాడీలు అడ్డంకులు: ప్రధాని మోడీ

'ఈ పరివార్‌వాడీలు (ఎస్‌పి) అధికారంలో ఉన్నప్పుడు, యూపీ అభివృద్ధికి మేము తీసుకువచ్చే ఏ పనికైనా వారు అడ్డంకులు పెట్టేవారు, ఈ పరివార్‌వాడీలు పేదలను, అట్టడుగున ఉన్నవారిని కూడా వదిలిపెట్టలేదని, వారిని కూడా ఇబ్బందులకు గురిచేశారని ప్రధాని మోడీ మండిపడ్డారు.

ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనేది నా సంకల్పం, వారు (ఎస్పీ) మీర్జాపూర్‌లో పేదలకు 800 ఇళ్లను మాత్రమే నిర్మించారు, అయితే గత 5 సంవత్సరాలలో మా ప్రభుత్వం మీర్జాపూర్ ప్రజలకు 28,000 ఇళ్లు నిర్మించిందన్నారు ప్రధాని మోడీ.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఏడవ, చివరి దశకు మార్చి 7న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు 2022 ఏడు దశల్లో జరుగుతున్నాయి. గురువారం ఆరో దశ పోలింగ్‌ జరిగింది.
మొత్తం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 10న ప్రకటించబడతాయి.

English summary
'Pariwarwadis' Put Obstacles In UP's Development, Didn't Let The Poor Progress: PM Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X