Parliament: పార్లమెంట్లో కొనసాగుతున్న ఎంపీల సస్పెన్షన్లు-141కు చేరిక-అయినా నోరెత్తని కేంద్రం..!

పార్లమెంట్లోకి నలుగురు అగంతకులు చొరబడిన ఘటనపై కేంద్రం ప్రకటన చేయాలని కోరడమే నేరం అన్నట్లుగా మారిపోతోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చోటు చేసుకున్న ఈ భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని కొన్ని రోజులుగా విపక్ష పార్టీలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. అయినా పట్టించుకోని కేంద్రం, విపక్ష ఎంపీల్ని మాత్రం వరుసగా సస్పెండ్ చేస్తూ పోతోంది. ఇవాళ మరో 49 మంది ఎంపీలు సస్పెండ్ కావడంతో వీరి సంఖ్య 141కు చేరింది.

Parliament live : opposition mps suspension continues as number reaches 141, but centre keeps quiet

పార్లమెంట్లోకి చొరబాటు ఘటనపై కేంద్ర హోంమంత్రి ప్రకటన కోరుతూ ఇవాళ కూడా ఉభయసభల్లో నిరసనలు కొనసాగాయి. అదే సమయంలో భారీ ఎత్తున ఎంపీల సస్పన్షన్ పైనా విపక్షాలు గళమెత్తాయి. దీంతో కేంద్రం ఎదురుదాడికి దిగింది. పార్లమెంట్ ఉభయసభల్లోనూ కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారనే కారణం చూపుతూ ఎంపీలపై సస్పెన్షన్ల వేటు కొనసాగిస్తున్నారు. ఇవాళ ఒక్క లోక్ సభ నుంచే ఏకంగా 49 మంది ఎంపీల్ని సస్పెండ్ చేశారు.

నిన్న ఉభయ సభల నుండి 78 మంది ప్రతిపక్ష ఎంపీలను (లోక్‌సభ నుండి 33 మంది, రాజ్యసభ నుండి 45 మంది) సస్పెండ్ చేయడంపై పార్లమెంటు శీతాకాల సమావేశాలను పూర్తిగా బహిష్కరించాలని ఇండియా బ్లాక్ పార్టీలు నిర్ణయించాయి. పార్లమెంటు భద్రతా ఉల్లంఘన అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుండి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ప్లేకార్డులు తీసుకుని సభలోకి వచ్చి నినాదాలు చేసిన తర్వాత వికృత ప్రవర్తన, సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు ఎంపీలను సస్పెండ్ చేశారు.

ఇవాళ సస్పెండైన ఎంపీల్లో వి.వైతిలింగం, గుర్జీత్ సింగ్ ఔజ్లా, సుప్రియ సూలే, సప్తగిరి శంకర్ ఉలక, అదూర్ ప్రకాష్, అబ్దుల్ సమద్, మనీష్ తివారీ, ప్రద్యుత్ బోర్డోలోయ్, గిర్ధారి యాదవ్, గీతా కొడా, ఫరాన్, జగత్రక్షకన్, ఎస్ఆర్ పార్థిబన్, ఫరూక్ అబ్దుల్లా , జ్యోత్స్న మహంత్ , ఎ.గణేశ మూర్తి , మాలా రాయ్ , పి.వేలుసామి , చందర్ కుమార్, శశి థరూర్ , సుదీప్ బంద్యోపాధ్యాయ, డింపుల్ యాదవ్ , హస్నైన్ మసూది , డానిష్ అలీ , ఖలీలుర్ రెహమాన్ ఉన్నారు.

అలాగే రాజీవ్ రంజన్ సింగ్ , సెంథిల్ కుమార్ , సంతోష్ కుమార్ , దులాల్ చంద్ర గోస్వామి , రవ్‌నీత్ సింగ్ డి. బిట్టు, మహ్మద్ సాదిక్ , ఎంకె ప్రసాద్ , పిపి మహ్మద్ ఫైజల్ , సజ్దా అహ్మద్ , జస్వీర్ సింగ్ గిల్ , అమోల్ కోహ్లే , సుశీల్ కుమార్ రింకు , సునీల్ కుమార్ సింగ్ , డాక్టర్ ఎస్ టి హసన్ , ఎం ధనుష్ కుమార్ , ప్రతిభా సింగ్ , తోల్. తిరుమావళవన్ , చంద్రశ్వర్ ప్రసాద్ , అలోక్ కుమార్ సుమన్ , దిలేశ్వర్ కమైత్ , అదుర్ ప్రకాష్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+