మూడు క్రిమినల్ లా బిల్లులు, టెలీకాం, ఈసీ బిల్లులకు ఆమోదం: పార్లమెంట్ నిరవధిక వాయిదా

న్యూఢిల్లీ: పార్లమెంట్​ ఉభయ సభలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. కీలకమైన మూడు క్రిమినల్​ బిల్లులు సహా టెలికాం, ఈసీ బిల్లలను ఆమోదించిన తర్వాత లోక్‌సభ, రాజ్య సభలు వాయిదా పడ్డాయి. ఇప్పటికే లోక్‌​సభలో ఆమోదం పొందిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులకు గురువారంరాజ్యసభ ఆమోద ముద్ర వేసింది.

అనంతరం రాజ్యసభను ఛైర్మన్​ జగదీప్ ధన్‌​ఖడ్ వాయిదా వేశారు ​. ఈ బిల్లుతో పాటు దేశ భద్రతను ప్రమాదం తలెత్తిన సమయంలో టెలికమ్యూనికేషన్​ సేవలను ప్రభుత్వం అధీనంలోకి తీసుకునేలా ప్రవేశపెట్టిన టెలికాం బిల్లును పార్లమెంట్​ ఆమోదించింది. కేంద్ర సమాచార, ఎలక్ట్రానిక్స్​ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సభలో ప్రవేశపెట్టగా.. స్వల్పకాలిక చర్చతోనే బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బుధవారమే ఈ బిల్లుకు లోక్​‌సభ పచ్చజెండా ఊపింది. ఆ తర్వాత ప్రెస్​ రిజిస్ట్రేషన్​ ఆఫ్​ పిరియాడికల్స్​ బిల్లు 2023కు కూడా ఆమోదం తెలిపిన తర్వాత లోక్‌​సభ వాయిదా పడింది.

parliament sine die today after passing 3 criminal law bills and telecommunications, EC bill

కాగా,ఈసీ బిల్లుకు లోక్‌​సభ ఆమోదం, మరోవైపు ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఎన్నికల కమిషనర్‌లను నియమించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. విపక్ష సభ్యులు సస్పెన్షన్‌కు గురైన నేపథ్యంలో స్వల్పకాలిక చర్చతోనే బిల్లుకు ఆమోదం లభించింది. సీఈసీ, ఈసీల నియామకం, సేవా నిబంధనలు, పదవీకాలం, వేతనాలకు సంబంధించిన అంశాలను పొందుపర్చిన ఈ బిల్లుకు రాజ్యసభ ఇప్పటికే ఆమోదం తెలిపింది.

ఇప్పటి వరకు సీఈసీ, ఈసీలను ప్రభుత్వమే నియమించేది. అయితే, కొత్త బిల్లు ప్రకారం సెర్చ్‌, ఎంపిక కమిటీలు ఈ బాధ్యతలను నిర్వహిస్తాయి. ఆమోదానికి ముందు చర్చలో పాల్గొన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 1991 చట్టంలో సీఈసీ, ఈసీల సేవా నిబంధనలు అస్పష్టంగా ఉన్నాయన్నారు. గత చట్టంలోని లోపాలను సరిదిద్ది కొత్త బిల్లును తీసుకొచ్చామని తెలిపారు.

ఈ ఏడాది మార్చిలో సీఈసీ, ఈసీల నియామకాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా బిల్లుందని వివరించారు. రాజ్యాంగంలో పేర్కొన్నట్లుగా అధికారాల విభజనకు అనుగుణంగా రూపొందించామన్నారు. అనంతరం మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం లభించింది. మరోవైపు, లోక్‌​సభలో సస్పెన్షన్‌​కు గురైన సభ్యుల సంఖ్య 100కు చేరింది. ఇప్పటికే 97 మంది సభ్యులను సస్పెండ్​ చేయగా.. తాజాగా మరో ముగ్గురు కాంగ్రెస్​ ఎంపీలపై వేటు పడింది. డీకే సురేశ్​, దీపక్​ బైజ్, నకుల్​ నాథ్‌​ను సస్పెండ్​ చేయాలంటూ పార్లమెంటరీ వ్యవహారల మంత్రి ప్రతిపాదించగా స్పీకర్​ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో లోక్‌సభ, రాజ్యసభల్లో కలిపి ఈ సంఖ్య 146కు చేరింది. దీంతో విపక్ష సభ్యులు లేకుండా బిల్లులకు ఆమోదం లభించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+