వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్డీయేకు దూరమవుతున్న పార్టీలు.. అప్పుడొకటి.. ఇప్పుడు మరొకటి..!

|
Google Oneindia TeluguNews

షిల్లాంగ్‌ : పౌరసత్వ సవరణ బిల్లు - 2018 ఎన్డీయేకు మైనస్ గా మారుతోంది. ఇప్పటికే ఓ పార్టీ గుడ్ బై చెప్పగా.. మరో పార్టీ కూడా అదే దారిలో నడవనుంది. ఎన్డీయేతో దోస్తీ విరమించుకుంటున్నట్లు ఏజీపీ (అసోం గణ పరిషత్) ఇప్పటికే ప్రకటించింది. తాజాగా మేఘాలయకు చెందిన నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) కూడా ఎన్డీయే కు బై బై చెప్పాలనుకుంటున్నట్లు సమాచారం. అయితే లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలా పార్టీలు దూరమవుతుండటం ఎన్డీయేకు మింగుడుపడని విషయం.

పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌ కు చెందిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు సిద్ధమైంది కేంద్రప్రభుత్వం. ఈమేరకు పౌరసత్వ సవరణ బిల్లుకు మంగళవారం లోక్‌సభలో ఆమోదముద్ర వేసింది. అయితే పౌరసత్వ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మేఘాలయ సీఎం కన్రాద్ సంగ్మా బీజేపీ తీరుపై మండిపడుతున్నారు.

parties are coming out from nda

ఈక్రమంలో ఎన్డీయేకు గుడ్ బై చెప్పాలని యోచిస్తున్నారట. పార్టీ నేతలతో చర్చించిన తర్వాత దీనిపై ఓ క్లారిటీకి రానున్నట్లు తెలుస్తోంది. ఐదు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రభావమున్న ఎన్‌పీపీ.. ఎన్డీయేకు దూరం కావాలనుకోవడం స్థానికంగా చర్చానీయాంశమైంది.

English summary
Citizenship Amendment Bill - 2018 becoming the minus of the NDA. There is a party goodbye already .. another party will walk the same way. Meghalaya's National People's Party (NPP) has also reported that saying bye bye to NDA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X