జనవరి 5వ తేదీన యూపీ ఓటర్ల తుది జాబితా, పోలింగ్‌కు గంట ఎక్కువ సమయం: సీఈసీ
ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం రివ్యూ చేసింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఇటీవల సూచన చేసింది. ఎన్నికలకు సంబంధించి పరిశీలించాని కోరింది. దీంతో సీఈసీ సుశీల్ చంద్రా ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై రివ్యూ చేసి.. మీడియాతో మాట్లాడారు.హైకోర్టు సూచనతో అన్నీ పార్టీలు, ప్రతినిధులతో సంప్రదింపులు జరిపామని వెల్డించారు. ఎన్నికను మాత్రం నిర్దేశిత సమయంలోనే నిర్వహిస్తామని తెలిపారు. అయితే రాజకీయ పార్టీలు మాత్రం కొవిడ్ ప్రొటొకాల్ పాటించి ర్యాలీలు తీయాలని కోరారు.
అన్నీ ఓటింగ్ బూతులలో వీవీప్యాట్ అమలు చేస్తారు. లైవ్ వెబ్ క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తారు. లక్ష ఓటింగ్ బూతులలో పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఉచిత హామీలు ఇవ్వొద్దని కోరారు. జనవరి 5వ తేదీన ఓటర్ల తుది జాబితా ఇస్తామని సీఈసీ తెలియజేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనే వారందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేస్తామని తెలిపారు. 5 రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ వేగంగా పూర్తిచేయాలని ఆదేశాలు జారీచేసింది. కరోనా వచ్చిన వారు కూడా ఓటు వేసే సౌకర్యం కల్పించారు.

పోలింగ్ బూతులలో ఓటర్ల సంఖ్యను తగ్గిస్తామని సీఈసీ వివరించారు. యూపీలో ఒక్కో పోలింగ్ బూతులో 1500 నుంచి 2 వేల వరకు ఓటర్లు ఉంటారని వివరించారు. 18-19 ఏళ్ల వయస్సు గల ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో సీఈసీ రివ్యూ చేసి.. ఎన్నికల గురించి తెలియజేశారు. సమయానికి ఎన్నికలను నిర్వహిస్తామని తెలిపారు.
అంతకుముందు యూపీలో బీజేపీ 200 సీట్లు గెలుచుకుంటుందని బుకీలు రూపాయికి 20 పైసలు బెట్ చేస్తున్నారు. బీజేపీ 222 సీట్లు గెలిస్తే 1.15 రూపాయి ఇస్తారు. ఒకవేళ ఎస్పీ 125 సీట్లు గెలిస్తే బుకీలు 1.40 రూపాయి ఇస్తారు. ఎస్పీ 110 సీట్లు గెలిస్తే 35 పైసలు ఇస్తారు. ఇక ఇక్కడ కాంగ్రెస్, బీఎస్పీ మాత్రం 5 నుంచి 10 సీట్లు గెలుచుకుంటారని భావిస్తున్నారు. అయితే ఎంఐఎం సీట్లు అనూహ్యంగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ రానుంది. అందులో యూపీ ప్రజలకు వరాలు ఉంటాయి. దానిని అనుగుణంగా బుకీలు తమ బెట్ నిర్వహిస్తున్నారు.
ఇక పంజాబ్ విషయానికి వస్తే ఆప్, కాంగ్రెస్ 40, 40 సీట్లను గెలుచుకుంటాయని చెబుతున్నారు. కనీసం 25 సీట్లు పక్కా అని తెలిపారు. బీజేపీ, అకాలిదల్ 5 నుంచి 10 సీట్లకే పరిమితం అవుతాయని అంచనా వేశారు. అయితే ఇదీ ఇప్పటివరకు ఉన్నా అంచనా.. ఇదీ మారే అవకాశం కూడా ఉంటుంది.












Click it and Unblock the Notifications