వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలిలోనే అనంతలోకాలకు.. ఓ ప్రయాణికుడి మృతి... తిరిగి ఢిల్లీకి మళ్లించినా..

|
Google Oneindia TeluguNews

విమాన ప్రయాణంలో అస్వస్థత గురయితే కష్టమే.. అక్కడ వైద్యులు ఉంటారు.. కానీ గుండెపోటు.. ఇతర సీరియస్ అంశాలు మాత్రం ప్రాణాల మీదకు వస్తాయి. అవును చాలా సందర్భాల్లో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఇవాళ కూడా అలాంటి ఘటన ఒకటి జరిగింది. ఓ అమెరికా జాతీయుడు ఢిల్లీ నుంచి నెవార్క్ వెళుతున్నాడు. భార్యతో కలిసి పయనిస్తున్నాడు. కానీ ఇంతలో అతను ఇబ్బంది పడ్డాడు. చివరికీ విమానాన్నే తిరిగి ఢిల్లీకి మళ్లించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అతను విగతజీవిగా మారాడు.

ఢిల్లీ నుంచి అమెరికాలోని నెవార్క్ వెళుతున్న విమానంలో ఓ ప్రయాణికుడు ఇబ్మంది పడ్డాడు. సిబ్బంది వచ్చి చూశారు. గాలిలో విమానం 3 గంటలు ప్రయాణించింది. హెల్త్ దృష్ట్యా తిరిగి ఢిల్లీకి మళ్లించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అతను చనిపోయాడు. అతడు అమెరికా జాతీయుడిగా గుర్తించారు. తన భార్యతో కలిసి ప్రయాణిస్తున్నాడు. విమానం గాల్లో ఉండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. టేకాఫ్ తీసుకున్న మూడు గంటల తర్వాత ఆ విమానం తిరిగి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది.

Passenger Dies Onboard, US-Bound Air India Flight Returns To Delhi

విమానంలోకి వచ్చిన ప్రవేశించిన ఎయిర్ పోర్టు వైద్య సిబ్బంది ఆ ప్రయాణికుడిని పరీక్షించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఆయన చనిపోయారని నిర్ధారించారు. విమాన సిబ్బంది ఎయిర్ పోర్టు పోలీసులకు వివరించారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు తదుపరి కార్యాచరణకు ఉపక్రమించారు. కానీ గాలిలోనే అతని ప్రాణాలు కోల్పోయాడు. తిరిగి విమానం మళ్లించిన ఫలితం లేకుండా పోయింది.

ఏఐ-105 అనే విమానం నెవార్క్ వెళుతుండగా ఘటన జరిగింది. అతని మృతికి సంబంధించిన ప్రక్రియను విమాన సిబ్బంది చూశారు. మిగతా ప్రయాణికులను సాయంత్రం 4 గంటలకు తిరిగి నెవార్క్ పంపించారు. ఇటు సదరు ప్రయాణికుడు బయట ఉంటే.. వైద్యం అందేది. ప్రాణాలు నిలబడేవి. కానీ అతను గాలిలో ఉండటం.. అప్పటికే 6 గంటల సమయం గడవడం జరిగిపోయింది. దీంతో ప్రాణాలను నిలబెట్టే పరిస్థితి లేకుండా పోయింది. కళ్ల ముందే భర్త చనిపోయాడు.

English summary
Air India flight headed to Newark in the US returned to Delhi airport three hours after take-off after a passenger died on board.ఢిల్లీ
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X