ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ లో భారీ ట్విస్ట్-దూకేసి బతికిపోయిన ఏకైక ప్రయాణికుడు..!

ఇవాళ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న సర్దార్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం ఐదు నిమిషాల వ్యవధిలోనే పక్కనే ఉన్న బీజే మెడికల్ కాలేజ్ పై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న 230 మంది ప్రయాణికులతో పాటు 10 మంది సిబ్బంది, మరో ఇద్దరు పైలట్లు కూడా మృత్యువాత పడ్డారని అంతా భావిస్తున్న తరుణంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.

ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ తర్వాత ఇక కుప్పకూలిపోవడమే మిగిలుంది. ఆకాశంలో 625 అడుగుల ఎత్తులోనే విమానం ఎగురుతోంది. అయితే పైకి లేవాల్సింది పోయి క్రమంగా కిందకు ఒరిగిపోతోంది. దీంతో విమానాన్ని నడుపుతున్న పైలట్ తో పాటు కోపైలట్, సిబ్బంది, ప్రయాణికులకు పరిస్ధితి అర్ధమైపోయింది. వారంతా ప్రాణభయంతో కేకలు పెడుతున్నారు. పైలట్ అయితే మేడే కాల్ కూడా ఇచ్చేశాడు. దీంతో ఇక విమానం కూలిపోవడమే తరువాయి. అలాంటి సమయంలో ఓ ప్రయాణికుడు ధైర్యం చేసి కిటికీ తెరిచి దూకేశాడు.

passenger Ramesh viswash kumar jumped from Ahmedabad air india flight saved life

ఎయిర్ ఇండియా విమానంలో 11ఏ సీట్ బుక్ చేసుకున్న విశ్వాష్ కుమార్ అనే ప్రయాణికుడు విమానం కూలిపోవడానికి కేవలం ఒకటి, రెండు నిమిషాలకు ముందు గొప్ప సమయస్పూర్తి ప్రదర్శించాడు. విమానం కూలకముందే కిటికీ తెరిచి అందులో నుంచి దూకేశాడు. దీంతో అక్కడే ఉన్న భవనాలపై పడ్డాడు. తీవ్ర గాయాల పాలైన అతన్ని ముందు ఎవరూ గమనించలేదు. అందరూ ఫ్లైట్ కూలిపోయిన స్థలానికి పరుగులు తీశారు. సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యారు. చివరికి ఎలాగోలా ఇతన్ని గమనించి ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన తాను బుక్ చేసుకున్న టికెట్ చూపించగానే అంతా షాకయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+