కండోమ్స్‌లో 5 కిలోల బంగారం తరలింపు: వ్యక్తి అరెస్ట్

Passenger tries to smuggle in gold in liquid form at Kochi airport
కొచ్చి/జైపూర్: అక్రమంగా బంగారాన్ని తరలించడంలో ఓ వ్యక్తి వినూత్న పంథాను ఎంచుకున్నాడు. అయితే ఆ వినూత్న పంథాను కూడా ఛేదించి పోలీసులు అతన్ని పట్టుకోవడం విశేషం. విషయమేటంటే.. గురువారం దుబాయ్ నుంచి కేరళ రాష్ట్రంలోని నెడుంబస్సెరి విమానాశ్రయానికి చేరుకున్న ఓ వ్యక్తి అక్రమంగా తీసుకువస్తున్న బంగారన్ని ద్రవరూపంలోకి మార్చి కండోమ్స్‌లో తరలించే ప్రయత్నం చేశాడు.

తనిఖీల్లో భాగంగా కస్టమ్స్ అధికారులు అతని వద్ద ఉన్న లగేజీని వెతికారు. అతని దగ్గర నాలుగు ప్లాస్టిక్ కంటైనర్‌లో రంగుతో కూడిన ద్రవ పదార్థాన్ని నింపిన కండోమ్స్ తనిఖీల్లో బయటపడ్డాయని కస్టమ్స్ అధికారులు తెలిపారు.

నెడుంబస్సెరి ఎయిర్ పోర్ట్‌లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికుడ్ని తనిఖీ చేయగా కండోమ్స్‌లో అక్రమంగా రవాణా చేస్తున్న 5.345 కిలోల లిక్విడ్ గోల్డ్ బయటపడిందని అధికారులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన ప్రయాణికుడ్ని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

రాజస్థాన్‌లో రూ. 58 లక్షల నగదు పట్టివేత

రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీగంగానగర్ జిల్లాలో పోలీసుల తనిఖీల్లో సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ. 58 లక్షల నగదు పట్టుబడింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వాహనాల తనిఖీలు జరిపిన పోలీసులు, సరైన ఆధారాలు లేకపోవడంతో ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+