విమాన పైలట్ గైర్హాజరు: 7గంటలపాటు 250మంది ప్రయాణికులకు చుక్కలే!

ముంబై: నగరంలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 250మంది ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. పైలెట్‌ గైర్హాజరు కావడంతో వారంతా విమానశ్రయంలోనే సుమారు 7 గంటలపాటు నిరీక్షించాల్సి రావడమే ఇందుకు కారణం.

ముంబై నుంచి అహ్మదాబాద్‌ వెళ్లాల్సిన ఏయిర్‌ఇండియా విమానం శనివారం ఉదయం 1.35 బయలుదేరాల్సి ఉండగా చివరి నిమిషంలో గంట ఆలస్యం అవుతుందని ప్రకటించారు. అనంతరం మరో 7 గంటల వరకు ఎలాంటి స్పందన రాలేదు.

 Passengers create ruckus at Mumbai airport over flight delay

తిండి, నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు విమాన సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకు కూడా దిగారు. కాగా, చివ‌ర‌కు సుమారు ఉదయం 8 గంటల ప్రాంతంలో పైలట్ రావడంతో విమానం బయలు దేరింది.

ఈ విషయంపై ఏయిర్‌ ఇండియా అధికారులను వివరణ కోరగా.. స్పెషల్‌ ట్రైన్‌డ్‌ పైలెట్‌ గైర్హాజరుతో ఈ సమస్య ఎదురైందని, వేరే పైలెట్‌ను సద్దుబాటు చేసి 8.20 విమానం టేకాఫ్‌ అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+