జగన్‌కు చెక్: మోడీ వైపు పవన్ కల్యాణ్, సిఎం చర్చలు?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయ ఆరంగేట్రం పైన మరో ప్రచారం ఊపందుకుంది. గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ వైపు పవన్ కల్యాణ్ మొగ్గు చూపుతున్నారని, ఆయన కమలం పార్టీ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
పవన్... ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి), లోక్ సత్తా, తెలుగుదేశం పార్టీలలో చేరుతారని, కాదు కాదు... కొత్త పార్టీ పెడతారనే ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా బిజెపి వైపు కూడా మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదని వార్తలు వస్తున్నాయి.

బిజెపి రాష్ట్ర కీలక నేతలు పవన్ కల్యాన్‌తో టచ్‌లో ఉన్నారట. పలువురు బిజెపి నేతలకు పవన్‌తో స్నేహం ఉంది. పవన్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం నేపథ్యంలో పలువురు నేతలు ఆయనను కలిసి కాకినాడ లోకసభ స్థానం నుండి పోటీ చేయాలని ఆఫర్ చేస్తున్నారట.
తెలుగుదేశం పార్టీ కూడా పవన్ కల్యాన్ కోసం చూస్తున్నదనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పవన్ తమ పార్టీలోకి వస్తే కాకినాడ లోకసభ టిక్కెట్ ఇస్తామని టిడిపి కూడా చెప్పిందట. బిజెపి కూడా అదే చెబుతోందట. అయితే, మోడీ పట్ల ఆకర్షితులైన పవన్ బిజెపి వైపే మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదంటున్నారు.
టిడిపి రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్ పవన్ కల్యాన్‌తో చర్చలు జరిపారట. తమ పార్టీ నుండి పోటీ చేయాలని కోరారట కూడా.
మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు బిజెపి, టిడిపిలు కలుస్తే..... పవన్ సహకారం ఉండే అవకాశముందంటున్నారు. రాష్ట్రంలో జగన్‌కు చెక్ పెట్టేందుకు పవన్ 'నమో' బ్రిగేడ్‌లో చేరే అవకాశాలున్నాయంటున్నారు. పవన్ టిడిపిలోకి వస్తే కాపులు, ఆయన అభిమానులు తమ వైపు మళ్లుతారని చంద్రబాబు భావిస్తున్నారట.












Click it and Unblock the Notifications