అభిమానం 'పీక్స్'కు వెళ్లింది: 'అరుంధతి నక్షత్రం వద్దు, పవన్ ఫోటోనే ముద్దు'

Subscribe to Oneindia Telugu

బెంగుళూరు: 'పవన్ కళ్యాణ్‌కు ఫ్యాన్స్ ఉండరు భక్తులే ఉంటారు'.. సోషల్ మీడియాలో పవన్ అభిమానులు తరుచూ చెప్పుకునే మాట ఇది. ఈ ఒక్క మాట చాలు అభిమానులు ఆయన్ను ఎంతగా ఆదరిస్తారో!.. ఆయన వెనుక ఎంత అభిమానఘనం ఉందో చెప్పడానికి.

ఒకరకంగా అభిమానులకు పవన్ కళ్యాణ్ దేవుడి లాగే కనిపిస్తాడు. ఆయనకున్న క్రేజ్ అలాంటిది. అయితే ఈ క్రేజ్ కొత్త పుంతలు తొక్కుతుండటం చాలామందిని నోళ్లు వెల్లబెట్టేలా చేస్తోంది. ఏకంగా అరుంధతి నక్ష్తత్రం స్థానంలో పవన్ కళ్యాణ్ ఫోటో దర్శనమిచ్చేదాకా పరిస్థితి వెళ్లిందంటే!.. అభిమానం ఎంత పీక్స్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

pawan kalyan craze crazy bridegroom showing pawan kalyan instead of arundhati nakshatra

ఇక అసలు విషయానికొస్తే.. కర్ణాటక రాష్ట్రంలోని ఒక పట్టణంలో ఇటీవల ఒక పెళ్లి వేడుక జరిగింది. పెళ్లి తంతు ముగిశాక అరుంధతి నక్షత్రాన్ని చూసే తంతు కొనసాగాల్సి ఉంది. అయితే ఇక్కడ అసలు చిక్కు వచ్చి పడింది. వధూవరులు ఇద్దరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావడంతో.. అరుంధతి నక్షత్రం స్థానంలో పవన్ కళ్యాణ్ ఫోటోను చూస్తామని పట్టుబట్టారు.

వధూవరుల తీరుకు పెళ్లికి వచ్చినవారంతా విస్మయం వ్యక్తం చేశారు. అయినా సరే వారు పట్టు వీడకపోవడంతో అప్పటికప్పడు పవన్ కల్యాణ్ ఫ్లెక్సీ ఒకటి తెచ్చి ఏర్పాటు చేశారు. ఆరాధ్య నటుడి ఫోటో ఏర్పాటు చేయడంతో వధూవరులు సంతోషంగా ఆయన దర్శనం చేసుకుని ఫోటోలకు పోజిచ్చారు. ఇదన్నమాట సంగతి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a strange incident A Crazy Bride Groom Showing Pawan Kalyan photo Instead of Arundhati Nakshatra. This video was going viral in Internet
Please Wait while comments are loading...