ఆరెస్సెస్ లేని భారత్ ఊహించగలమా ? మహా ప్రచారంలో పవన్ సంచలన వ్యాఖ్యలు..!
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. ఈ నెల 20న ఒకే దశలో జరగబోతున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార పర్వం రేపు సాయంత్రం ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బల్లార్ పూర్ లో పర్యటించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. బహిరంగసభ నిర్వహించారు. ఇందులో రాష్ట్రంలోని మహాయుతి కూటమిని ఓటేయాల్సిన అవసరాన్ని ఓటర్లకు గుర్తుచేశారు. అదే సమయంలో ఏపీలో తన అనుభవాన్ని కూడా ఓటర్లతో పవన్ పంచుకున్నారు.
బల్లార్పూర్ ఒక మినీ భారతదేశమని, ఇక్కడ అన్ని భాషలూ, అన్ని ప్రాంతాల ప్రజలు కలిసి ఉంటారని పవన్ కళ్యాణ్ తెలిపారు. మన బతుకమ్మ, మన సమ్మక్క సారక్క జాతర ఇక్కడ ఈ నేలపై జరుగుతుందన్నారు. కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చి మన సమ్మక్క సారక్క జాతరను, బతుకమ్మను అపహాస్యం చేస్తారని కాంగ్రెస్ నేతల్ని ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు. అన్ని మతాలను సమానంగా చూసే మన సనాతన ధర్మంపై దాడి జరిగితే కచ్చితంగా బయటకు వస్తానని, పొరాడుతానని పవన్ స్పష్టం చేశారు.

జనసేన పార్టీని బలంగా తీసుకెళ్లడంలో మహారాష్ట్ర వాసులైన శివాజీ మహారాజ్, హిందూ హృదయ్ సామ్రాట్ శ్రీ బాలసాహెబ్ ఠాక్రే వంటి వారి స్ఫూర్తి ఉందని పవన్ గుర్తుచేశారు. శతాబ్దాల ఎదురుచూపులు తరవాత మనకు అయోధ్య రామ జన్మభూమి లో రామ్ లల్లా విగ్రహం ప్రతిష్ట జరిగిందన్నారు. మన బలార్ష ప్రజల అదృష్టం... ఆ ఆలయానికి తలుపులు ఇక్కడ టేకుతో తయారు అయ్యాయన్నారు.
దారి పొడవునా వస్తుంటే హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా నితిన్ గడ్కరీ మొత్తం హైవేలు నిర్మించారని పవన్ ప్రశంసించారు. నిర్మించడానికి రోడ్లు ఏమీ లేవు అని ఎన్డీఏ అభ్యర్థి సుధీర్ ముంగటివర్ చెప్పారని, ఇది ఎన్డీయే ప్రభుత్వం సాధించిన ప్రగతి అన్నారు. శివసేన-జనసేన రెండు కూడా సనాతన ధర్మ పరిరక్షణ కోసం పని చేసేవని, అలాంటి భావనకు స్ఫూర్తి ఇచ్చిన వ్యక్తి బాలాసాహెబ్ ఠాక్రే అన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం పొందుపరిచానన్నారు.

ఆరెస్సెస్ లేని భారత్ ఊహించుకుంటే ఇంత బలంగా ఉండేదా అని పవన్ ప్రశ్నించారు. ఆరెస్సెస్ ఉంది కాబట్టే విచ్ఛిన్న శక్తులు దేశాన్ని విడగొట్ట లేకపోయాయన్నారు. ఎన్డీయే ప్రభుత్వం మహారాష్ట్ర అభివృద్ది కోసం అనేక ప్రత్యేక చర్యలు తీసుకుందని, ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం స్థాపించేందుకు అందరూ ఓటు వేయాలని కోరారు. మహారాష్ట్ర అభివృద్ది చెందాలన్నా, బల్లార్పూరు అభివృద్ది చెందాలన్నా, లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థగా మహారాష్ట్ర ఎదగాలంటే ఎన్డీయే కూటమి అభ్యర్థిని గెలిపించాలన్నారు.
తాను ఏపీలో లో మార్పు తీసుకొచ్చి చూపించానని, వైసీపీని ఓడించలేరు అంటే ఓడించి చూపించానని, ఇప్పుడు మీరు కూడా ఎన్డీయే ప్రభుత్వాన్ని గెలిపించడానికి సిద్దం కావాలని పవన్ ఓటర్లను కోరారు. తన పిల్లలు ఇద్దరితో తాను మరాఠీలో మాట్లాడుతానని, భాష మీద గౌరవంతో నేర్చుకున్నానని పవన్ తెలిపారు. విదేశీ భాషలు నేర్చుకునే మనం, మన సరిహద్దు రాష్ట్రాల భాషలు నేర్చుకోవాలి కదా అన్నారు. కనీసం 5 ప్రాంతీయ భాషలు నేర్చుకోవాలని, మన భాష, సంస్కృతిని నేర్చుకోవాలని కోరారు.
-
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications