పవన్ కల్యాణ్: ‘వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటును చీలనిచ్చేది లేదు’ - సత్తెనపల్లి సభలో జనసేన నేత

పవన్ కల్యాణ్

జనసేన, తెలుగుదేశం పార్టీలు 2014 ఎన్నికల్లో లాగా 2018 ఎన్నికల్లోనూ కూటమిగా ఉన్నట్లయితే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉండేది కాదని జనసేన నేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనిచ్చేది లేదని చెప్పారు. జనసేన పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే వ్యూహం తనకు ఉందని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో జనసేన పార్టీ కౌలు రైతుల భరోసా యాత్ర సభలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురు కౌలురైతు కుటుంబాలకు నగదు సాయం అందించారు. కౌలు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

''నేను కదిలితేనే వైసీపీ వాళ్లకి బాధ. వారాంతపు పొలిటీషియన్ అంటారు. వారానికి ఒక రోజు వస్తేనే ఇంత గోల చేస్తున్నారు.. నేను రోజూ ఉండే ఇంకెంత గోల చేస్తారు. ఆ రోజులు ఉన్నాయి’’ అని పవన్ పేర్కొన్నారు.

''మీలాగ మాకు మా తాతలు సంపాదించిన డబ్బులు లేవు. లేదంటే అక్రమాలు, దోపిడీలు చేసి సంపాదించిన డబ్బుల లేదు. లేదా వేలకోట్ల విరాళాలు రావు. సొంత సంపాదనతో పార్టీని నడుపుతున్నాను. మీలాంటి వాళ్లు తృణమో పణమో ఇస్తే పార్టీని నడుపుతూ ఉన్నా. తొమ్మిద సంవత్సరాల నుంచి’’ అని చెప్పారు.

''నేను ఎక్కువ మాట్లాడను.. నేనేంటో చేసి చూపిస్తాను’’ అన్నారు.

(నోట్: ఈ వార్త అప్‌డేట్ అవుతోంది)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+