ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్: వచ్చే వారం నుంచి పేటీఎం ఇక బ్యాంకుగా సేవలు

Subscribe to Oneindia Telugu

ముంబై: ఇప్పటివ వరకు ఈ వ్యాలెట్‌గా సేవలందించిన పేటీఎం త్వరలోనే పేమెంట్స్ బ్యాంకుగా మన ముందుకు రానుంది. మే 23 నుంచి బ్యాంకింగ్‌ కార్యకలాపాలు సాగించేందుకు పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌కు ఆర్‌బీఐ తుది అనుమతులు మంజూరు చేసింది. ఈ విషయాన్ని బ్యాంకు పబ్లిక్‌ నోటీస్‌లో తెలియజేసింది.

ఈ బ్యాంకు లైసెన్స్‌ విజయ శేఖర్‌ శర్మ పేరుతో మంజూరైంది. దీంతో కంపెనీ తన ఈ వాలెట్‌ వ్యాపారాన్ని ఈ బ్యాంకుకు బదిలీ చేయనుంది. దీనికి ఇప్పటికే 21.8 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. మే 23 తర్వాత నుంచి పేటీఎం వాలెట్‌ పీపీబీఎల్‌లో భాగమవుతుంది.

Paytm Payments Bank to launch next week, names Renu Satti as the new CEO

ఒక వేళ వినియోగదారులకు ఈ విషయం ఇష్టం లేనట్లైతే పేటీఎంకు తెలియజేయాల్సి ఉంటుంది. అప్పుడు పేటీఎం ఈ వాలెట్లోని బ్యాలెన్స్‌ వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తుంది. అయితే, ఈ విషయాన్ని మే 23 కంటే ముందే తెలియజేయాల్సి ఉంది.

ఆరునెలల నుంచి వినియోగించని ఈ వాలెట్‌లోని మొత్తాలను వినియోగదారుల అనుమతితోనే పీపీబీఎల్‌లోకి మారుస్తారు. దీంతోపాటు పేటీఎం బ్యాంక్‌ రూ.లక్ష వరకు డిపాజిట్లను నేరుగా స్వీకరిస్తుంది. కాగా, పేటీఎం పేమెంట్స్ బ్యాంకు‌కు రేణు శెట్టి సీఈఓగా నియమతులు కానున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India's leading digital wallet player Paytm has received the final licence from the Reserve Bank of India for its payments bank entity.
Please Wait while comments are loading...