• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అక్కడ అంతే : 500 ఓట్లలో పోలైంది 7.. ఆ ఇంటి పెద్దను 7 బుల్లెట్లతో చంపిన ఉగ్రవాదులు

|

దేశవ్యాప్తంగా ఓట్లు వేసేందుకు ప్రజులు బారులు తీరీ తమ ఓటు హక్కును వినియోగించుకుని తమకు కావల్సిన నాయకున్ని ఎన్నుకుంటుంటే తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాల్లో మాత్రం ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. కేంద్రప్రభుత్వం ఎన్ని భద్రతా చర్యలు తీసుకున్నా ఉగ్రవాదులు,తీవ్రవాదులు ఎన్నికలు బహిష్కరించిన ప్రాంతాల్లో మాత్రం ప్రజలు గడ్డు పరిస్థితులో ఉంటున్నారు. ఈనేపథ్యంలోనే ఇటివల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసినందుకు ఇంటి యజమానిని చంపివేశారు ఉగ్రవాదులు.

జమ్ముకశ్మీర్‌లో వేర్పాటు వాదుల ఘాతుకం

జమ్ముకశ్మీర్‌లో వేర్పాటు వాదుల ఘాతుకం

ఇటివల జరిగిన జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో అక్కడి వేర్పాటు వేర్పాటు వాదులు ఎన్నికలను బహిష్కరించారు. దీంతో కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ప్రజలు ఓటు వేయడానికి ఎవరు ముందుకు రాలేదు. అయితే అదే కుల్గాం జిల్లాలోని చాల గ్రామాల్లో కూడ ఎవ్వరు ఓటు వేసేందుకు ముందుకు రాలేదు. ఎందుకంటే ఓట్లు వేయాలని మనస్సులో ఉన్న తీవ్రవాదుల భయానికి అక్కడ అసలు పోలింగ్ శాతం అతి తక్కువగా నమోదైంది. ఓకవేళ ఓటు వేస్తే వేర్పాటు వాదుల ఆగ్రహానికి గురికావల్సి వస్తుందని భావించిన ప్రజలు చాల గ్రామాల్లో ఓటు వేసేందుకు ముందుకు రాలేదు.

500 ఓట్లున్న గ్రామంలో పోలైన 7 ఓట్లు

500 ఓట్లున్న గ్రామంలో పోలైన 7 ఓట్లు

అయితే కుల్గాం జిల్లాలోనే జుంగల్‌పోరా గ్రామంలో కూడ ఇదే పరిస్థితి .కాగా ఆ గ్రామలో 500 ఓట్లు ఉన్నాయి.అయినా ఒక్కరు కూడ ముందుకు రాలేదు. కాని అదే గ్రామానికి చెందిన పీడీపీ కార్యకర్త మాత్రం ఓటు వేసేందుకు ముందుకు వచ్చాడు. ఓటు వేసి తన కర్తవ్యాన్ని నెరవేర్చుకోవాలని భావించాడు. ఈనేపథ్యంలోనే పీడీపీ కార్యకర్త అయిన మహ్మద్ జమాల్ కుటుంభ సభ్యులు మొత్తం అయిదుగురు సభ్యులు ఓటు వేశారు.కాని ఆయన మాత్రం ఆనారోగ్య కారణాల రిత్య ఓటు వేయడానికి వెళ్లలేదు. ఇక విచిత్రమేమిటంటే 500 ఓట్లు ఉన్న జుంగల్ గ్రామంలో మొత్తం 7 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అందులో జమాల్ కుటుంభ సభ్యులు వేసినవే 5 ఓట్లు ఉన్నాయి.

ఓటు వేసిన కుటుంభ పెద్దపై కాల్పులు

ఓటు వేసిన కుటుంభ పెద్దపై కాల్పులు

ఇంకేముంది మొత్తం అయిదు వందల ఓట్లు ఉంటే అందులో 5 ఓట్లు ఓకే కుటుంభంనుండి పడడంతో వేర్పాటువాదుల ఆగ్రహానికి జమాల్ కుటుంభం గురికావాల్సి వచ్చింది. గ్రామంలో ఏప్రిల్ 29న ఎన్నికలు జరగగా గత ఆదివారంనాడు ఇంట్లో నిద్రిస్తున్న జమాల్‌పై గుర్తుతెలియని దుండగుడు బయటి నుండి 5 రౌండ్ల కాల్పులు జరిపి వెళ్లాడు. దీంతో జమాల్‌కు గాయాలు కావడంతో ఆయన్ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.అయితే తీవ్ర గాయాలు కావడంతో జమాల్ చికిత్స పోందుతూ సోమవారం మ‌ృతి చెందాడు.

రాబోయో ఎన్నికల్లో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేందుకే కాల్పులు

రాబోయో ఎన్నికల్లో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేందుకే కాల్పులు

అయితే గ్రామంలో ఎవ్వరితోను గోడవలు లేని జమాల్ కుటుంభం కేవలం ఓటు వేసినందుకే వేర్పాటు వాదులు ఆ కుటుంభ పెద్దను పోట్టన పెట్టుకున్నారని జమాల్ కుటుంభ సభ్యులు చెబుతున్నారు.కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా పీడీపీ చీఫ్ మహబుబా ముఫ్తి కూడ స్థానిక కశ్మీర్ వేర్పాటు వాదులకు మద్దతుగా పలు ప్రకటనలు చేసింది. అయినా ఆమే పార్టీకి చెందిన కార్యకర్తలు వేర్పాటు వాదులు చంపడం విశేషంగా చెప్పవచ్చు.కాగా త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకే తీవ్రవాదులు వారిని చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

English summary
PDP worker Mohammad Jammal from South Kashmir’s Kulgam district knew casting his vote would not be easy this time, yet he insisted he and his family would not stay away from the polling booths.PDP Worker’s Family Cast 5 of 7 Votes i He Was Shot 5 Times For It
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X