అరుణాచల్‌ప్రదేశ్ సీఎంగా పెమా ఖండూ హ్యాట్రిక్
ఈటానగర్: అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు పెమా ఖండూ. ఈ మేరకు బుధవారం జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో పెమా ఖండూను తమ నేతగా మరోసారి ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. ఈ భేటీకి కేంద్ర పర్యవేక్షకులుగా రవిశంకర్ ప్రసాద్, తరుణ్ ఛుగ్ హాజరయ్యారు.
కాగా, గురువారం పెమా ఖండూ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 46 స్థానాల్లో విజయం సాధించింది. నేనషల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీఈపీ) ఐదు స్థానాల్లో గెలుపొందింది. ఎన్సీపీ మూడు, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ) రెండు, కాంగ్రెస్ ఒక స్థానంలో, స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి.

మొత్తం 60 స్థానాల్లో ఎన్నికలకు ముందే 10 స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. వారిలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్ ఉన్నారు. మరోవైపు, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తన రెండు స్థానాలను రాష్ట్రం నుంచి నిలబెట్టుకుంది.
పెమా ఖండూ రాజకీయ ప్రస్థానం
#WATCH | Itanagar: Pema Khandu to be the CM of Arunachal Pradesh for another term, re-elected as the Leader of BJP Legislative Party. pic.twitter.com/CenfJ2OvL4
— ANI (@ANI) June 12, 2024
ప్రముఖ రాజకీయ కుటుంబంలో జన్మించిన పెమా ఖండూ తన ప్రాథమిక విద్యను తవాంగ్‌లో పూర్తి చేసి, తర్వాత న్యూఢిల్లీలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆయన న్యూఢిల్లీలోని హిందూ కళాశాల విద్యార్థి. 2011లో హెలికాప్టర్ ప్రమాదంలో పెమా తండ్రి దోర్జీ ఖండూ మరణించిన తర్వాత ఖండూ రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఖండూ 2011లో అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు గతంలో తన తండ్రికి చెందిన ముక్తో నియోజకవర్గం నుంచి ఏకపక్షంగా ఎన్నికయ్యారు.
Feeling so honoured to be elected unanimously as the Legislature Party leader of @BJP4Arunachal.
— Pema Khandu པདྨ་མཁའ་འགྲོ་། (@PemaKhanduBJP) June 12, 2024
With utmost humility, I accept the responsibility of leading the BJP to another term of development oriented governance in sync with the vision of Hon'ble Prime Minister Shri… pic.twitter.com/O14dt1OgsD
-
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం












Click it and Unblock the Notifications