బయటపడ్డ చైనా దుర్భుద్ధి: భారత్‌పై విషం చిమ్మింది, అరుణాచల్‌పై ఇలా
చైనా తన దుర్భుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. భారత్‌పై విషపూరిత కథనాలను ప్రచురితం చేస్తూ తన అక్కసును చాటుకుంది.
బీజింగ్: చైనా తన దుర్భుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. భారత్‌పై విషపూరిత కథనాలను ప్రచురితం చేస్తూ తన అక్కసును చాటుకుంది. భారత్ అక్రమంగా పరిపాలిస్తున్న అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రజలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని, తీవ్ర కష్టాలుపడుతున్నారని చైనాకు చెందిన ఓ అధికారిక పత్రిక రాసింది.
అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు తిరిగి చైనాకు వచ్చేయాలని అనుకుంటున్నట్లు కూడా అందులో పేర్కొంది. దలైలామాకు అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించే అవకాశం ఇస్తే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరించిన నేపథ్యంలోనే అక్కడి పత్రికల్లో ఇలాంటి కథనం రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. '

చట్ట విరుద్ధంగా భారత్ పరిపాలిస్తున్న దక్షిణ టిబెట్(అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొంత భాగాన్ని చైనా తమదిగా చెప్పుకుంటోంది) ప్రాంతంలోని ప్రజలంతా తీవ్ర కష్టాలు, దుర్బర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. అలాగే ఒకరకమైన వివక్షను చవిచూస్తూ వారు చైనాకు తిరిగొచ్చేయాలని అనుకుంటున్నారు' అంటూ చైనా డెయిలీ తన వక్ర బుద్ధిని చాటుకుంది.
చైనా మీడియాలో వచ్చిన కథనాలపై భారత్ తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది. ఇప్పటికే నెటిజన్లు చైనాపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టిబెట్ ప్రజలు కూడా చైనా పాలనలో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని, వారు స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్నా.. చైనా ఎందుకు ఇవ్వడం లేదంటూ చైనాపై నెటిజన్లు నిలదీస్తున్నారు.












Click it and Unblock the Notifications