మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన తెలంగాణ గ్రామాల ప్రజలు!
మహారాష్ట్రలో బుధవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉన్న 12 గ్రామాల ఓటర్లు తమ ఓటు మహారాష్ట్రలో కూడా వినియోగించుకుంటున్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా రాజూరా నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో వారు ఓటు వేశారు.
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని 12 గ్రామాల ప్రజలు ఎప్పుడూ రెండు రాష్ట్రాల్లో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం. ఇక్కడి ఓటర్లకు తెలంగాణ తోపాటు మహారాష్ట్ర ఓటరు కార్డులు ఉండటంతో రెండు చోట్లా ఓట్లు వేస్తున్నారు. గత ఏడాది నవంబర్ 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మరోవైపు, ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంతోపాటు మహారాష్ట్రలోని ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికల్లోనూ ఈ గ్రామాల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజాగా, బుధవారం జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటు వేశారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఈ 12 గ్రామాల ప్రజలు వివాదం పరిష్కారం కాకపోవడంతో రెండు రాష్ట్రాల్లో ఓటు వేయడంతోపాటు రెండు రాష్ట్రాల సంక్షేమ పథకాలను కూడా అందుకుంటున్నారు.
కాగా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ పలు చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది. బుధవారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా 4,136మంది అభ్యర్థులు పోటీ చేశారు. 9.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నప్పటికీ..చాలా మంది పోలింగ్ కేంద్రాలకు రాలేదు. దీంతో పోలింగ్ తక్కువగా నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు 58.22 శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం.
మహారాష్ట్రలో పలువురు బాలీవుడ్ నటులు, క్రీడా, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు, బీజేపీ, శివసేన షిండే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గాలతో కూడిన మహాయుతి.. కాంగ్రెస్ , శివసేన ఉద్ధవ్ వర్గం, ఎన్సీపీ శరద్ పవార్ వర్గాలు ఉన్న మహావికాస్ అఘాడీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. కాగా, ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ మహారాష్ట్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరనుందని పేర్కొన్నాయి. ఎంవీఏ నుంచి ఈసారి మహాయుతి కూటమికి గట్టిపోటీ ఎదురైంది. నవంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications