చెన్నైలో ఇళ్లలోకి డ్రైనేజ్, వరద నీరు: రాస్తారోకో చేస్తున్న ప్రజలు, ప్రభుత్వం నిర్లక్షం చేసింది!

Posted By:
Subscribe to Oneindia Telugu
  చెన్నైలో ఇళ్లలోకి వరద నీరు (Video) | Oneindia Telugu

  చెన్నై: దక్షిణ తమిళనాడులో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్థం అయ్యింది. చెన్నైలోని లోతట్టు ప్రాంతాల్లో వరద, డ్రైనేజ్ నీరు ఇళ్లలోకి చేరిపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది నిర్లక్షం చేస్తున్నారని ప్రజలు ఆందోళనకు దిగారు.

  మంత్రి జయకుమార్ నిర్లక్షంగా మాట్లాడుతున్నారని ఆయన మీద చెన్నై నగర ప్రజలు మండిపడుతున్నారు. కార్పొరేషన్ అధికారులు నిర్లక్షం చేస్తున్నారని, వర్షం నీరు, డ్రైనేజ్ నీరు ఇళ్లలోకి వస్తున్నదని శుక్రవారం చెన్నైలోని తాంబరం, ముదిచూర్ ప్రాంతాల్లో ప్రజలు రాస్తారోకో, ధర్నా చేస్తున్నారు.

  People stage road roko Thambaram and Mudichurin Chennai

  వెంటనే ఇళ్లలో ఉన్న వరద, డ్రైనేజ్ నీరు బయటకు పంపించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. పలు పార్టీల కార్యకర్తలు తాంబరం, ముదిచూర్ ప్రాంత ప్రజలకు మద్దతు ఇచ్చారు. తమిళనాడు ప్రభుత్వం నిర్లక్షం చెయ్యడం వలనే చెన్నై నగరం చెరువుల్లా మారిపోయాయని డీఎంకే పార్టీ నాయకులు ఆరోపించారు.

  చెన్నై నగరంతో పాటు తమిళనాడులోని సముద్రతీరంలోని లోతట్టు ప్రాంతంల్లో నివాసం ఉంటున్న వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ప్రభుత్వం మనవి చేసింది. విద్యా సంస్థలకు సోమవారం వరకు సెలవు ప్రకటించారు. అన్ని ప్రైవేటు కార్యాలయాలు, ఐటీ కంపెనీలకు సెలవులు ప్రకటించాలని, సమస్యలు ఎదురుకాకుండా చూడాలని తమిళనాడు ప్రభుత్వం మనవి చేసింది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Low-lying areas in Chennai were the worst hit as water entered many houses.Mudichur near Thambaram. People to stage protest in Thambaram - Mudichur road.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి