• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా వ్యాక్సిన్‌ను ఎవరూ కొనొద్దు: ఆ బాధ్యత ప్రభుత్వాలదే: టీకా రేటుపై క్లారిటీ: సీరమ్ సీఈఓ

|

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి అవసరమైన వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి దేశీయంగా ఏడు ఫార్మా కంపెనీలు శ్రమిస్తున్నాయి. భారత్ బయోటెక్ సహా సీరమ్ ఇన్‌స్టిట్యూట్ వంటి సంస్థలు ఈ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. వాటిల్లో చాలావరకు ట్రయల్స్ దశలో ఉన్నాయి. హ్యూమన్ ట్రయల్స్‌ను ఆరంభించాయి. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కూడా సత్ఫలితాలను ఇస్తున్నాయి. భారత్‌కు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తొలిరెండు దశల ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి. మూడోదశ ట్రయల్స్‌ను నిర్వహించడానికి అనుమతులు రావాల్సి ఉంది.

  Oxford-AstraZeneca Covid-19 Vaccine By November, Price - 50 శాతం వ్యాక్సిన్ భారత్‌కే : Serum CEO

  కరోనా కాటు: వైఎస్ క్లాస్‌మేట్, తెనాలి మాజీ ఎమ్మెల్యే మృతి: అత్యవసర చికిత్స అందిస్తోన్నా

  50 శాతం వ్యాక్సిన్ భారత్‌కే..

  50 శాతం వ్యాక్సిన్ భారత్‌కే..

  తాము ఉత్పత్తి చేసే కరోనా వ్యాక్సిన్‌లో 50 శాతం డోసులు భారత్‌లోనే వినియోగిస్తామని సీరమ్ సీఈఓ ఆదార్ పూనావాలా స్పష్టం చేశారు. ఓ ఇంగ్లీష్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. వ్యాక్సిన్‌ డోసుల్లో సగం భారత్‌లో పంపిణీ చేస్తామని అన్నారు. మరో 50 శాతం వ్యాక్సిన్‌ను ఇతర దేశాలకు సరఫరా చేస్తామని చెప్పారు. మూడో దశ మానవ ప్రయోగాల అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని ఆయన అన్నారు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే ఆగస్టులో ప్రయోగాలు చేస్తామని చెప్పారు. ఆ ప్రయోగాలు సత్ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.

  లక్షల డోసుల్లో ఉత్పత్తి..

  లక్షల డోసుల్లో ఉత్పత్తి..

  మూడోదశ ప్రయోగాలు ఫలిస్తే.. ఆ వెంటనే వ్యాక్సిన్‌ డోసుల్ని తయారు చేస్తామని తెలిపారు. వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ అన్నీ సాఫీగా సాగి ఫలితాలు సానుకూలంగా వస్తాయని అంచనా వేస్తున్నామని అన్నారు. వ్యాక్సిన్ తయారీలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సీటీతో కలిసి పని చేస్తామని ఆదార్ పూనావాలా స్పష్టం చేశారు. ఈ ఏడాది చివరి నాటికి లక్షల వ్యాక్సిన్‌ డోసులను ఉత్పత్తి చేస్తామని అన్నారు. వచ్చే ఏడాది మొదటి మూడు నెలల్లో 30 నుంచి 40 కోట్ల మేర వ్యాక్సిన్ డోసులను తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, ఆ సామర్థ్యం తమకు ఉందని అన్నారు.

  వెయ్యి రూపాయల కంటే తక్కువే..

  వెయ్యి రూపాయల కంటే తక్కువే..

  ఈ వ్యాక్సిన్‌ ధర వెయ్యి రూపాయలు లేదా అంతకంటే తక్కువే ఉంటుందని అదార్‌ అభిప్రాయపడ్డారు. కరోనా సంక్షోభ పరిస్థితుల్లో తాము లాభాలను ఆశించట్లేదని అన్నారు. ప్రజలు ఎవరూ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చని ఆదార్ చెప్పారు. ప్రభుత్వాలే వాటిని కొనుగోలు చేస్తాయని, ఇమ్యునైజేషన్‌ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తాయని తాము భావిస్తున్నట్లు చెప్పారు. ఆఫ్రికా వంటి నిరుపేద దేశాలకు 2 నుంచి 3 డాలర్లకే పంపిణీ చేసేలా ప్రణాళికలను రూపొందించుకున్నట్లు చెప్పారు.

  ఫ్రంట్‌లైన్ వర్కర్లకు తొలిదశలో..

  ఫ్రంట్‌లైన్ వర్కర్లకు తొలిదశలో..

  ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారికే తొలి దశలో వ్యాక్సిన్‌ ఇవ్వాల్సిన అవసరం ఉందని తాను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నట్లు ఆదార్ పూనావాలా చెప్పారు. తొలిదశ వ్యాక్సిన్‌ను ఎవరికి ఇవ్వాలనే విషయంపై కేంద్ర ప్రభుత్వమే ఓ కార్యాచరణ ప్రణాళికను రూపొందించే అవకాశం ఉందని అన్నారు. డాక్టర్లు, నర్సులు, హెల్త్ వర్కర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు వంటి ఫ్రంట్‌లైన్ వర్కర్లతో పాటు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి తొలిదశ డోసులను ఇచ్చే అవకాశాలు లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

  English summary
  Serum Institute of India CEO Adar Poonawalla said 50 per cent of the vaccines that will be manufactured by his firm will be supplied to India and the rest to other countries. He said the vaccine will mostly be purchased by governments, and people will receive them free of cost through immunisation programmes.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more