Chhattisgarh survey : ఈసారి ఛత్తీస్ ఘడ్ లో గెలిచేదెవరు ? తేల్చేసిన పీపుల్స్ పల్స్ సర్వే..!
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో ఒకటైన ఛత్తీస్ ఘడ్ లో ఎవరు గెలవబోతున్నారనే అంశంపై అప్పుడే సర్వేలు మొదలైపోయాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటుందా లేక బీజేపీ పుంజుకుని అధికారాన్ని కైవసం చేసుకుంటుందా అన్న చర్చ సాగుతోంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశంలో మారుతున్న పరిస్ధితుల్లో ఛత్తీస్ ఘడ్ ప్రజలు ఎవరివైపు మొగ్గు చూపుతున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది.
ఛత్తీస్ ఘడ్ లో ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలపై హైదరాబాద్ కు చెందిన పీపుల్స్ పల్స్ సంస్ధ సర్వే చేపట్టింది. పీపుల్స్ పల్స్ మూడ్ సర్వే పేరుతో చేపట్టిన ఈ సర్వే ఫలితాల్ని విడుదల చేసింది. ఛత్తీస్ ఘడ్ లో జూన్ నెలలో నిర్వహించిన ఈ సర్వేలో 3 వేల శాంపిల్స్ సేకరించింది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 35 నుంచి 40 శాంపిల్స్ సేకరించారు. ఈ సర్వే ఫలితాల్ని విశ్లేషించి తుది రిపోర్ట్ ఇవాళ ఇచ్చింది.

90 సీట్లున్న ఛత్తీస్ ఘడ్ అసెంబ్లీలో సాధారణ మెజారిటీ సాధించి అధికారం కైవసం చేసుకోవాలంటే మ్యాజిక్ మార్క్ 46 సీట్లు సాధించాల్సి ఉంటుంది. ఈసారి పీపుల్స్ పల్స్ మూడ్ సర్వే అంచనాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారం నిలబెట్టుకోబోతున్నట్లు తేలింది. కాంగ్రెస్ కు 53 నుంచి 60 సీట్లు లభించవచ్చని సర్వేలో తేలింది. అలాగే విపక్ష బీజేపీ 20 నుంచి 27 సీట్లకు పరిమితం కాబోతున్నట్లు తేలింది.

కాంగ్రెస్ పార్టీ 46 శాతం ఓట్లు సాధించి అధికారం నిలబెట్టుకోబోతున్నట్లు పీపుల్స్ పర్స్ సర్వే తేల్చింది. బీజేపికి 38 శాతం ఓట్లు లభించబోతున్నాయి. బీఎస్పీ, ఇండిపెండెంట్లకు రెండు సీట్లు దక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సీఎం భూపేష్ భగేల్ కు ఉన్న ప్రజాదరణే కాంగ్రెస్ అధికారం నిలబెట్టుకునేందుకు ప్రధాన కారణంగా నిలవబోతోంది. భగేల్ ప్రయోగిస్తున్న ప్రాంతీయ కార్డు కాంగ్రెస్ కు మరోసారి విజయాన్ని కట్టబెట్టబోతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ హిందూత్వ కార్డును కాంగ్రెస్ ఛత్తీస్ ఘరియా(ఛత్తీస్ ఘడ్ వాసులు) కార్డు అధిగమించబోతోంది. అలాగే సంక్షేమ పథకాల అమలు కూడా కీలకంగా మారుతోంది.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications