వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీపుల్స్ పల్స్ ప్రీపోల్ సర్వే: అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్, రెండో స్థానంలో బీజేపీ, జేడీఎస్ కీలకం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీకి శనివారం జరిగిన ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. 'పీపుల్స్‌ పల్స్‌' విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని, హంగ్‌ అసెంబ్లీ ఏర్పడుతుందని తేల్చింది.

కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, ఆ తర్వాత స్థానాన్ని భారతీయ జనతా పార్టీ, తతీయ స్థానాన్ని జనతాదళ్‌ సెక్యులర్‌(జేడీఎస్) పార్టీ దక్కించుకుంటుందని సర్వేలో వెల్లడైంది.

రాజకీయ పరిశోధనా సంస్థ 'పీపుల్స్‌ పల్స్‌' సిబ్బంది, కన్నడ దిన పత్రిక 'కోలర్‌వాణి' సహకారంతో ఏప్రిల్‌ 27వ తేదీ నుంచి మే 9వ తేదీవరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు తిరిగి, అంటే దాదాపు 3,600 కిలోమీటర్లు ప్రయాణించి ఈ సర్వేను నిర్వహించినట్లు వెల్లడించింది.

Peoples Pulse pre-poll survey predicts hung assembly in Karnataka, Congress single largest party

సర్వే ఫలితాల ప్రకారం:
కాంగ్రెస్‌ పార్టీకి 93-103
బీజేపీకి 83-93
జేడీఎస్‌కు 33-43

ఇక ఇతరులకు రెండు నుంచి నాలుగు సీట్లు వస్తాయి. కాంగ్రెస్‌ పార్టీకి 39.6 శాతం, బీజేపీకి 34.2. జేడీఎస్‌కు 21.6 శాతం, ఇతరులకు 4.6 శాతం ఓట్లు వస్తాయి. కాగా, చివరి రెండు రోజుల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం ప్రభావాన్ని, ఆఖరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చుకునే ఓటర్ల సంఖ్యను సర్వేలో పరిగణించలేదు. పాలక, ప్రతిపక్ష సభ్యుల్లో ఎవరు విజయం సాధించినా వారి మధ్య ఓట్ల వ్యత్యాసం పెద్ద ఎక్కువగా ఉండదు.

ఈ సర్వే ప్రకారం 43 అసెంబ్లీ స్థానాల్లో పోటీ నువ్యా, నేనా అన్నట్లుగా ఉంది. వీటిలో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌ అభ్యర్థులు ఎవరైనా గెలవచ్చు. ఈ 43 స్థానాల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయన్న అంశంపైనే ఏ పార్టీ రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న అంశం ఆధారపడి ఉంది.

English summary
A pre-poll survey conducted by Peoples Pulse, a political research organization predicted a hung assembly in the state with Congress emerging as a single largest party with 93-103 seats, followed by BJP with 83-93 seats in the 224-member assembly. The JD (S) is likely to get 33-43 seats and play a key role in the formation of next government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X