ఏ ముఖం పెట్టుకుని వచ్చావు: ఆర్ కే నగర్ లో దినకరన్ కు షాక్: కాళ్లబేరానికి !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారుసుడు నేనే అంటూ ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారు, మీకు అమ్మ వారుసుడు అని చెప్పుకునే అర్హత ఉందా ? అంటూ ఆర్ కే నగర్ ప్రజలు టీటీవీ దినకరన్ మీద మండిపడుతున్నారు.

ఏఐఏడీఎంకే అమ్మ పార్టీ అభ్యర్థిగా టీటీవీ దినకరన్ ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్ కే నగర్ లో ఎలాగైనా విజయం సాధించాలని దినకరన్ ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక యువతను తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

నీళ్లు నమిలిన దినకరన్

నీళ్లు నమిలిన దినకరన్

ఆర్ కే నగర్ నియోజక వర్గంలో ఇంటింటికి తిరిగి దినకరన్ ప్రచారం చేస్తున్నారు. అయితే ఓ వీదిలో దాదాపు వందలాది మంది మహిళలు దినకరన్ ను నడిరోడ్డులో చుట్టుముట్టారు. మీరు ఏ ముఖం పెట్టుకుని ఎన్నికల ప్రచారం చెయ్యడానికి ఇక్కడికి వచ్చారు అంటూ నడిరోడ్డులో గట్టిగా నిలదీయడంతో దినకరన్ నీళ్లు నమిలారు.

తుఫాను వచ్చిన సమయంలో

తుఫాను వచ్చిన సమయంలో

తుఫాన్ వచ్చి ఈ ప్రాంతం మునిగిపోయిన సమయంలో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఆ సమయంలో అమ్మ ఇక్కడి ప్రజలకు అనేక హామీలు ఇచ్చారని స్థానిక మహిళలు గుర్తు చేశారు. అయితే అమ్మ ఇచ్చిన హామీలను మీ ప్రభుత్వం పట్టించుకుందా ? అంటూ దినకరన్ ను నిలదీశారు.

తాగడానికి నీళ్లు లేవు

తాగడానికి నీళ్లు లేవు

జయలలిత ఆసుపత్రిలో చేరక ముందు వరకు అధికారులు ఇక్కడి ప్రజల సమస్యలు పట్టించుకున్నారని స్థానిక మహిళలు గుర్తు చేశారు. అయితే జయలలిత ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఒక్క పని జరగలేదని, కనీసం ఇక్కడ తాగు నీటి సమస్య ఉన్నా పట్టించుకునేనాధుడే లేడని స్థానిక మహిళలు మండిపడటంతో దినకరన్ కంగుతిన్నాడు.

మహిళలతో పాటు వారు కూడా వదిలి పెట్టలేదు

మహిళలతో పాటు వారు కూడా వదిలి పెట్టలేదు

ఆర్ కే నగర్ లో మహిళలు నిలదీయడంతో హడలిపోయిన దినకరన్ ఓపెన్ టాప్ వాహనంలో ప్రచారం చెయ్యడానికి వెళ్లారు. అయితే అక్కడ ఆయనకు అదే పరిస్థితి ఎదురైయ్యింది. ఇక్కడి సమస్యలు తీర్చని మీ ప్రభుత్వానికి ఓటు వెయ్యమని స్థానికులు తేల్చి చెప్పడంతో దినకరన్ కు చెమటలుపట్టాయి. ఎట్టి పరిస్థితిలో శశికళ వర్గాన్ని ఆదరించమని స్థానిక మహిళలు తేల్చి చెప్పారు.

కాళ్లు బేరానికి వచ్చిన టీటీవీ

కాళ్లు బేరానికి వచ్చిన టీటీవీ

ఆర్ కే నగర్ లో పదేపదే స్థానిక ప్రజలు నిలదీయడంతో చివరికి దినకరన్ దిగివచ్చాడు. తమిళనాడులో నాలుగేళ్లు మాప్రభుత్వం అధికారంలో ఉంటుందని, నన్ను గెలిపిస్తే జయలలిత ఇచ్చిన హామీలు అన్నీ నేరవేర్చుతానని దినకరన్ స్థానికులకు మనవి చేశారు. అయితే ఆయన మాటలను స్థానికులు నమ్మకపోవడంతో దినకరన్ కాళ్లబేరానికి వస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
RK Nagar by Election 2017: Pepole angry over TTV Dinakaran election campaign in RK Nagar.
Please Wait while comments are loading...