దాని గురించి నాకు తెలియదు: 'గాలి 100 కోట్ల మార్పిడి'పై యడ్యూరప్ప

గాలి జనార్ధన్ రెడ్డి వంద కోట్ల మార్పిడి గురించి తనకు తెలియదని, ఆ వివరాలేవి తనకు తెలియదని యెడ్యూరప్ప చెప్పారని తెలుస్తోంది.

బెంగళూరు: కర్నాటక మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డి రూ.100 కోట్ల రద్దయిన నోట్లను మార్చుకున్నారనే ఆరోపణల పైన బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్ప ఓ టీవీ ఛానల్‌తో స్పందించారని తెలుస్తోంది.

గాలి జనార్ధన్ రెడ్డి తన కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఆయన వంద కోట్ల రూపాయల నల్లధనాన్ని ఓ అధికారి సహాయంతో తెల్లగా మార్చుకున్నారని డ్రైవర్ ఆత్మహత్యతో వెలుగు చూసింది.

దీనిపై ప్రశ్నించగా.. దాని గురించి తనకు తెలియదని, ఆ వివరాలేవి తనకు తెలియదని యెడ్యూరప్ప చెప్పారని తెలుస్తోంది. దీనిపై విచారణ జరిపితే నిజాలు అన్ని వాటంతట అవే బయటకు వస్తాయన్నారు. అధికారి భీమా నాయక్, డ్రైవర్ రమేష్ గౌడ మధ్య వ్యవహారంగా ఎంపి శ్రీరాములు కొట్టి పారేశారు.

gali janardhan reddy

కాగా, కేఏఎస్ అధికారి భీమా నాయక్ వద్ద డ్రైవర్‌గా పని చేసే రమేష్ గౌడ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇది కర్నాటకలో సంచలనం రేపింది.

గాలి.. అధికారి భీమా నాయక్ సాయంతో ఇరవై శాతం కమీషన్‌తో రూ.100 కోట్ల నల్లధనాన్ని తెల్లగా మార్చుకున్నాడని, ఇందుకు కమీషన్‌తో పాటు 2018 ఎన్నికల్లో సీటు ఇప్పించడంలో సాయం చేయాలని కూడా అడిగినట్లుగా ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+