ఆదానీ - జగన్ ముడుపుల వ్యవహారంలో అనూహ్య పరిణామం..!!
ఆదానీ ముడుపుల వ్యవహారం కలకలం రేపింది. అమెరికాలో నమోదైన అభియోగాల పైన పెద్ద ఎత్తున రాజకీయం దుమారం చెలరేగింది. భారత్‌లో సోలార్ ఎనర్జీ ఒప్పందాల కోసం అదానీ గ్రూపు రూ. 2,029 కోట్ల ముడుపుల ఆరోపణల పై అమెరికాలో కేసు నమోదైంది. రేపటి నుంచి పార్ల మెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు కేంద్రంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. న్యాయస్థానం ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఆసక్తి కరంగా మారుతోంది.
ఆదానీ ముడుపుల పై సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ కేసు పై దర్యాప్తు కు ఆదేశించాలని న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టులో పిటీషన్ వేసారు. గతంలో కూడా హిండెన్‌బర్గ్ రిపోర్టుపై దర్యాప్తు కోరుతూ ఆయన పిటిషన్ వేశారు. ఈ పిటీషన్ పైన కోర్టు స్పందన తెలియాల్సి ఉంది. ఇటు, భారత్‌లో సోలార్ ఎనర్జీ ఒప్పందాల కోసం అదానీ గ్రూపు రూ. 2,029 కోట్ల ముడుపులు ఇచ్చారనే ఆరోపణలతో కేసు నమోదైంది. ఈ కేసులో గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా మొత్తం 8 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. రేపు (సోమవారం) తక్షణ విచారణ కోరుతూ పిటిషనర్ విశాల్ తివారీ మెన్షన్ చేయనున్నారు. దీంతో, అందరి చూపు సుప్రీం వైపే ఉంది.

గౌతమ్ ఆదానీ పలు రాష్ట్రాల్లో విద్యుత్ సంస్థలకు సెకీ ద్వారా సోలార్ విద్యుత్ కట్టబెట్టేందుకు ఒప్పందాల కోసం ముడుపులు ఇచ్చారనే అభియోగాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ ఆరోపణలను ఆదానీ ఖండించారు. ఈ వ్యవహారంలో ఏపీ మాజీ సీఎం జగన్ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఏపీలో విద్యుత్ ఒప్పందాల కోసం జగన్ కు ఆదానీ ముడుపులు చెల్లించారనేది ఆభియోగం. అయితే, వైసీపీ నేతలు వీటిని ఖండించారు. అదే సమయంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం సైతం ఆదానీ ముడుపుల వ్యవహారం పైన ఆచి తూచి స్పందిస్తోంది. కానీ, జగన్ ను మాత్రం ఈ వివాదంలో ఫిక్స్ చేసేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి లీగల్ ఒపీనియన్ కోరినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications