అమ్మ ఆస్తులు జాతీయం చేయాలి: మద్రాస్ హైకోర్టులో పిటిషన్
ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని.. వాటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజల బాగోగుల కోసం ఖర్చు చేయాల్సిందిగా చూడాలని పిటిషన్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
చెన్నై: జయలలిత మృతి తర్వాత ఆమె ఆస్తులు ఎవరికి దక్కుతాయనే చర్చ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా జయలలిత ఆస్తులను జాతీయం చేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
ఈ మేరకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా పిటిషన్ లో పేర్కొన్నారు. తమిళనాడుకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ఈ పిటిషన్ దాఖలు చేసింది. రిటైర్డ్ జస్టిస్ పర్యవేక్షణలో ఈ వ్యవహారం అంతా నడిపించాలని పిటిషన్ లో కోరారు.

ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని.. వాటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజల బాగోగుల కోసం ఖర్చు చేయాల్సిందిగా చూడాలని పిటిషన్ ద్వారా విజ్ఞప్తి చేశారు. జయ ఆస్తుల వివరాలన్నింటిని పిటిషన్ లో పొందుపరిచారు.
కాగా, న్యాయమూర్తులు జస్టిస్ సెల్వం, కళైయారసన్ తో కూడిన బెంచ్ ఈ పిటిషన్ గురువారం నాడు విచారించే అవకాశముంది.












Click it and Unblock the Notifications