పండగ అని చూడని మోడీ సర్కార్: పెంపు మాత్ర కామన్: అక్కడ పెట్రోల్‌ను దాటిన డీజిల్ రేటు
న్యూఢిల్లీ: దేశంలో ఇంధన ధరలు అడ్డు, అదుపు లేకుండా పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకొనే విజయదశమి నాడు కూడా ఇదే పరిస్థితి. పండగ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుకుంటూనే పోతున్నాయి. పండగ పూట కూడా విరామాన్ని ఇవ్వట్లేదు. వాహనదారులపై అదనపు భారాన్ని మోపుతూనే ఉన్నాయి. పండగైనా, పబ్బమైన బాదుడు మాత్రం కామన్ అన్నట్లుగా వ్యవహరిస్తోంది మోడీ సర్కార్. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. అసలే కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందుల పాలైన కోట్లాది కుటుంబాలపై పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల రూపంలో అదనపు భారం పడుతోంది.

పెట్రోల్, డీజిల్‌పై ఎంత పెరిగిందంటే..
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తాజాగా చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్, డీజిల్‌పై 35 పైసల మేర పెంపుదల కనిపించింది. ఒకేసారి లీటర్ ఒక్కింటికి 35 పైసలు పెంచడం అంటే మాటలు కాదు. రికార్డుస్థాయి పెరుగుదల ఇది. ఇదే పెంపుదల అన్ని ఆయిల్ కంపెనీలకూ వర్తిస్తుంది. తాజాగా పెరిగిన ధరలతో దేశంలోని అనేక నగరాల్లో పెట్రోల్ ధర లీటర్ ఒక్కింటికి 115 రూపాయలను దాటింది. డీజిల్ సైతం వంద రూపాయల మార్క్‌ను దాటేసింది.

ముంబైలో నూటొక్కటి..
దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.105.14 పైసలకు చేరింది. డీజిల్ 93.87 పైసలుగా నమోదైంది. ముంబైలో పెట్రోల్ రూ.111.09 పైసలు పలుకుతోంది. అక్కడ డీజిల్ ధర వంద రూపాయలను దాటింది. రూ.101.78 పైసలకు చేరింది. చెన్నైలో పెట్రోల్ రూ.102.40 పైసలు, డీజిల్ ధర రూ.98.26 పైసలుగా నమోదైంది. పెట్రోల్ అమ్మకాలపై తమిళనాడు ప్రభుత్వం మూడు రూపాయల మేర పన్నును తగ్గించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయినట్టయింది. వరుసగా పెంచుతోన్న ధరల వల్ల ఇప్పుడు అక్కడ కూడా పెట్రోల్ ధర వంద రూపాయల మార్క్‌ను దాటింది.

పెట్రోల్ కంటే డీజిల్ రేటే అధికం..
కాగా- తాజా పెంపుతో కోల్‌కతలో పెట్రోల్ ధర రూ.105.76 పైసలుగా నమోదైంది. డీజిల్ ధర రూ.96.98పైసలు. బెంగళూరులో పెట్రోల్ రేటు రూ.108.80, డీజిల్ రూ.99.07 పైసలు, లక్నోలో పెట్రోల్ రూ.102.15 పైసలు, డీజిల్ రూ.94.31 పైసలకు చేరింది. రాంచీలో పెట్రోల్ రూ.99.60 పైసలు, డీజిల్-99.63 పైసలు పలుకుతోంది. ఇక్కడ పెట్రోల్ కంటే డీజిల్ రేటు అధికంగా పలుకుతోంది. పాట్నాలో పెట్రోల్ రూ.108.44 పైసలు, డీజిల్ రూ.100.43 పైసలు, చండీగఢ్‌లో పెట్రోల్ రూ.101.20 పైసలు, డీజిల్ 93.59 పైసలుగా నమోదైంది.

హైదరాబాద్, విజయవాడల్లో
హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.109.37 పైసలు, డీజిల్ రూ.102.42 పైసలు పలుకుతోంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.21 పైసలు, డీజిల్ ధర రూ.103.68 పైసలకు చేరింది. భోపాల్‌లో పెట్రోల్ రూ.113.73 పైసలు, డీజిల్ రూ.103.03 పైసలు, నోయిడాలో పెట్రోల్ రూ.102.38 పైసలు, డీజిల్ రూ.94.50 పైసలకు చేరింది. ఈ నెల మొదటి నుంచీ చమురు సంస్థలు ఇంధన ధరలను పెంచుకుంటూనే వస్తోన్నాయి. ఈ 15 రోజులలో ఇప్పటిదాకా పెట్రోల్‌పై రూ.4.90 పైసలు, డీజిల్‌పై రూ.3.90 పైసల మేర పెరిగింది.

మళ్లీ.. మళ్లీ పెంపు..
ఈ పెరుగుదల ఇక్కడితో ఆగుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకమైంది. ఇక్కడితో ఆగలానూ కనిపించట్లేదు. ఇదివరకట్లా మళ్లీ వరుసగా వాటి పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచబోవనే గ్యారంటీ ఉండట్లేదు. ఈ నెల ఆరంభంలోనే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం వల్ల- మున్ముందు మరిన్ని వాతలు ఉంటాయనే సంకేతాన్ని చమురు కంపెనీలు ఇవ్వకనే ఇచ్చినట్టయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరల్లో చోటు చేసుకున్న పెరుగుదల వల్లే ఇంధన ధరలను సవరించాల్సి వచ్చిందని చమురు కంపెనీలు చెబుతున్నాయి.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications