రెండు రోజులే గ్యాప్: పెట్రోల్, డీజిల్ మళ్లీ భగ్గు: ఈ సారి మరింత: లీటర్ రూ.103కు దగ్గరగా
న్యూఢిల్లీ: ఇంధన ధరలకు మళ్లీ రెక్కలు మొలిచాయి. వరుసగా నాలుగు రోజుల పాటు వాహనదారుల వీపు విమానం మోత మోగించిన చమురు సంస్థలు.. రెండు రోజుల విరామం అనంతరం మళ్లీ వాటి రేట్లు పెంచాయి. ఈ నెల 4వ తేదీన ఆరంభమైన పెట్రోలు, డీజిల్ ధరల దూకుడు ఏడవ తేదీ వరకూ కొనసాగింది. వరుసగా నాలుగు రోజుల పాటు వాటి ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంది. 8,9 తేదీల్లో ఇంధన ధరల్లో మార్పులేవీ చోటు చేసుకోలేదు. సోమవారం మళ్లీ కదలిక కనిపించింది. రెండు రోజుల గ్యాప్ అనంతరం మళ్లీ పెరుగుదల బాట పట్టాయి.
Recommended Video
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెల్లడించిన తాజా సవరణల ప్రకారం- పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 26 పైసలు, డీజిల్ లీటర్ ఒక్కింటికి 33 పైసల మేర పెరిగింది. దీనితో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్-రూ.91.53, డీజిల్ 82.06 పైసలుగా రికార్డయింది. ముంబైలో పెట్రోల్ రేటు 97.86 రూపాయలు ఉంటోంది.

డీజిల్ ధర 89.17 పైసలకు చేరింది. చెన్నైలో పెట్రోల్ రూ. 93.38, డీజిల్ ధర రూ. 86.96, కోల్‌కతలో పెట్రోల్ రూ.91.66 పైసలు, డీజిల్ ధర రూ.84.90 పైసలు పలుకుతోంది. పాట్నాలో పెట్రోల్-93.77, డీజిల్-87.27, బెంగళూరులో పెట్రోల్-94.57, డీజిల్-86.99, హైదరాబాద్‌లో పెట్రోల్-95.13, డీజిల్-89.47 పైసలుగా నమోదైంది. లక్నోలో పెట్రోల్-89.56, డీజిల్-82.43, నొయిడాలో పెట్రోల్-89.64, డీజిల్-82.43గా రికార్డయ్యాయి. రాష్ట్రాల ప్రభుత్వాలు విధించిన విలువ ఆధారిత ధరల ప్రకారం.. వేర్వేరు చోట్ల వేర్వేరు రేట్లు ఉంటాయి.
రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్ పెట్రోల్ 102 రూపాయల మార్క్‌ను దాటింది. పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 102.42 పైసలుగా రికార్డయింది. మధ్యప్రదేశ్‌లోని నగరాబంధ్, అనూప్‌పూర్, రీవా, ఛింద్వాడలో ఇదే పరిస్థితి కనిపించింది. నగరాబంధ్‌లో లీటర్ పెట్రోలు 102.67 పైసలు, అనూప్‌పూర్‌లో 102.12కు చేరింది.
రీవాలో పెట్రల్ లీటర్ ఒక్కింటికి 101.76, ఛింద్వాడలో 101.39 పైసలు పలుకుతోంది. ఇదివరకు వంద రూపాయల మార్క్‌ను దాటిన పట్టణం.. శ్రీగంగానగర్ ఒక్కటే ఉండేది. వరుసగా ఇంధన ధరలు పెరగడంతో పలు పట్టణాల్లో పెట్రోల్ రేట్లు వంద రూపాయలకు పైగా చేరాయి. మరోసారి పెరుగుదల చోటుచేసుకుంటే 103 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేని పరిస్థితి నెలకొంది.
-
అంటుకున్న పెట్రో మంట -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications