పెట్రోల్, డీజిల్ రేట్లు మరోసారి భారీగా పెంపు: బెంచ్‌మార్క్ ప్రైస్: పర్స్ ఖాళీ
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ మళ్లీ పెరుగుతూనే ఉన్నాయి. వాహనదారుల జేబులను కొల్లగొడుతూనే ఉన్నాయి. గురువారం కూడా వాటి రేట్లు పెరిగాయి. ఇంధన ధరలను పెంచే విషయంలో చమురు సంస్థలు ఏ మాత్రం వెనుకాడట్లేదు. వాహనదారులపై అదనపు భారాన్ని మోపుతూనే ఉన్నాయి. అసలే కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందుల పాలైన కోట్లాది కుటుంబాలపై పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల రూపంలో వీపు విమానం మోత మోగుతోంది. దీనికి అడ్డుకట్ట పడుతుందని, రేట్లు తగ్గుతాయని అనుకోవడం అత్యాశే అయ్యేట్టు ఉంది.

బెంచ్‌మార్క్ ప్రైస్
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తాజాగా చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్, డీజిల్‌పై 35 పైసల మేర పెంపుదల కనిపించింది. లీటర్ ఒక్కింటికి 35 పైసల మేర పెంచడాన్ని బెంచ్‌మార్క్‌గా పెట్టుకున్నట్టు కనిపిస్తోన్నాయి చమురు కంపెనీలు. లీటర్ ఒక్కింటికి 35 పైసల మేర పెంచడం వరుసగా ఇది రెండోసారి. బుధవారం కూడా ఇదే బెంచ్‌మార్క్ ప్రైస్‌తో ఇంధన ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ 35 పైసల మేర సవరించాయి. రికార్డుస్థాయి పెరుగుదల ఇది. తాజాగా పెరిగిన ధరలతో దేశంలోని అనేక నగరాల్లో లీటర్ పెట్రోల్ 115 రూపాయలను దాటింది. డీజిల్ వంద రూపాయల మార్క్‌ను దాటేసింది.

పాపం తమిళనాడు..
దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.106.54 పైసలకు చేరింది. డీజిల్ 95.27 పైసలుగా నమోదైంది. ముంబైలో పెట్రోల్ రూ.112.44 పైసలు పలుకుతోంది. అక్కడ డీజిల్ రూ.103.26 పైసలకు చేరింది. కోల్‌కతలో పెట్రోల్ ధర రూ.107.12 పైసలుగా నమోదైంది. డీజిల్ ధర రూ.98.38 పైసలు. చెన్నైలో పెట్రోల్ రూ.103.61 పైసలు, డీజిల్ ధర రూ.99.59 పైసలుగా నమోదైంది. పెట్రోల్ అమ్మకాలపై తమిళనాడు ప్రభుత్వం మూడు రూపాయల మేర పన్నును తగ్గించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయినట్టయింది. వరుసగా పెంచుతోన్న ధరల వల్ల ఇప్పుడు అక్కడ కూడా పెట్రోల్ ధర వంద రూపాయల మార్క్‌ను ఎప్పుడో దాటేసింది. ఇక డీజిల్ వంద రూపాయలకు చేరువైంది.

బెంగళూరులోనూ..
కాగా- బెంగళూరులో పెట్రోల్ రేటు రూ.110.26, డీజిల్ రూ.101.12 పైసలు, లక్నోలో పెట్రోల్ రూ.103.52 పైసలు, డీజిల్ రూ.95.72 పైసలకు చేరింది. నోయిడాలో పెట్రోల్ రూ.103.74 పైసలు, డీజిల్-95.61 పైసలు పలుకుతోంది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.110.82 పైసలు, డీజిల్ రూ.103.94 పైసలకు చేరింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.112.98 పైసలు, డీజిల్ ధర రూ.105.52 పైసలకు చేరింది. పాట్నాలో పెట్రోల్ రూ.110.04 పైసలు, డీజిల్ రూ.101.86 పైసలు, జైపూర్‌లో పెట్రోల్ రూ.113.74 పైసలు, డీజిల్ రూ.104.96 పైసలు, గుర్‌గావ్‌లో పెట్రోల్ రూ.104.15, డీజిల్- 96.02, చండీగఢ్‌లో పెట్రోల్ రూ.102.54, డీజిల్ రూ.94.99 పైసలుగా నమోదైంది.

కాస్తో, కూస్తో విరామమే తప్ప..
రోజువారీ పెరుగుదలలో అడపాదడపా కొంత విరామం లభిస్తోందే తప్ప.. రేట్లు మాత్రం తగ్గట్లేదు. రెండు రోజులు బ్రేక్ ఇస్తే.. వారం రోజుల పాటు వాటి ధరలను పెంచే పరిస్థితి దేశంలో నెలకొంది. ఈ రోజుతో ఇంధన ధరలను పెంచడాన్ని చమురు సంస్థల ఆపివేస్తాయని ఏ రోజుకు ఆ రోజు అనుకోవడం ఓ అత్యాశగానే మిగిలిపోయింది. ప్రతిరోజు వాహనదారులను బాదడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు కనిపిస్తోన్నాయి చమురు సంస్థలు. ఇదివరకట్లా మళ్లీ వరుసగా వాటి పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచబోవనే గ్యారంటీ ఉండట్లేదు. రేట్లు ఎక్కడికి వెళ్లి ఆగుతాయనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications