5 రాష్ట్రాల ఎన్నికల తర్వాతే పెట్రో భారం.. రూ.6 నుంచి రూ.8 వరకు పెరిగే ఛాన్స్
దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు కొనసాగుతున్నాయి. అందుకే పెట్రో ధరల్లో మార్పులు ఉండటం లేదు. వాస్తవానికి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర పెరుగుతుంది. ఇటు రష్యా.. ఉక్రెయిన్ ఇష్యూ కూడా ఉంది. అయినప్పటికీ పెట్రో ధరలు స్థిరంగా ఉంటున్నాయి. మిగతా దేశాలు ధరలు పెంచుకుంటూ వస్తున్నాయి. కానీ భారత దేశంలో మాత్రం 3 నెలల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలో ఎటువంటి మార్పులు లేవు.
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వంద రోజులుగా స్థిరంగా ఉన్నాయి. గత నవంబర్ 4వ తేదీ నుంచి భారత్‌లో ఇందనపు ధర పెరగలేదు. బ్యారెల్ ముడి చమురు ధర 80 నుంచి 94 డాలర్లకు పెరిగింది. త్వరలో బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లకు చేరుతుందని నిపుణలు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు ఒక డాలర్ పెరిగితే భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు 45 పైసల వరకు హైక్ అవుతుంది.

పెరిగిన బ్యారెల్ ధరల ప్రకారం దేశంలో ఇంధన ధరలు రూ.6కి పైగానే పెరగాలి. పన్నులతో కలిపి అదీ రూ.8కి చేరుతుంది. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈ ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఎన్నికలు ముగిసిన వెంటనే మొత్తం భారాన్ని సామాన్యుడిపై మోపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సమాచారం.
నవంబర్ 2021 వరకు దేశంలో పెట్రోల్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. కొన్ని రోజులు వరుసగా ధరలు పెరగడంతో సామాన్యుడు బైక్ తీయాలంటేనే భయపడ్డాడు. నవంబర్ 3న కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుకగా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఒక్కసారిగా 10 రూపాయలు తగ్గించడంతో వాహనదారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మార్చి 10వ తేదీ తర్వాత మళ్లీ భారం పడే సూచనలు ఉన్నాయి. అప్పుడు వాహనదాలరు మళ్లీ గగ్గోలు పెట్టాల్సిందే. అదీ అధికార బీజేపీకి అనుకూల, వ్యతిరేక తీర్పు వచ్చిన కూడా పెట్రో ధరలు పెరగడం ఖాయం అని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications