యథేచ్ఛగా పెట్రో ధరల బాదుడు: రూ.100 మార్క్: హైదరాబాద్, విజయవాడ, విశాఖల్లో రేట్లివీ..

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టిస్తోన్న సంక్షోభ పరిస్థితుల్లోనూ ఇంధన ధరల పెరుగుదల యథేచ్ఛకు అడ్డుకట్ట పడట్లేదు. వాటి రేట్ల పెరుగుదల బ్రేకుల్లేని బండిలా కొనసాగుతూనే ఉంది. చమురు సంస్థలు వాహనదారుల మీద భారాన్ని మోపుతూనే ఉన్నాయి. ఆదివారం కూడా వాటి ధరల్లో పెరుగుదల కనిపించింది. తాజాగా పెంపుతో విజయవాడలో పెట్రోల్ రేటు 101 రూపాయలకు చేరువైంది. విశాఖపట్నం 100 రూపాయలకు దగ్గరగా నమోదైంది. దేశవ్యాప్తంగా ముంబై సహా పలు నగరాల్లో పెట్రోల్ ధర వంద రూపాయల మార్క్‌ను ఎప్పుడో దాటేసింది.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ శనివారం చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 26 నుంచి 27 పైసలు, డీజిల్ లీటర్ ఒక్కింటికి 29 నుంచి 31 పైసల మేర పెరిగింది. దీనితో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ రూ.95.03, డీజిల్ 85.95 పైసలుగా రికార్డయింది. ముంబైలో పెట్రోల్ రేటు 101.25 రూపాయలు ఉంటోంది. డీజిల్‌ ధర 93.10 పైసలకు చేరింది. విజయవాడలోనూ పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 100 రూపాయలను దాటేసింది. లీటర్ పెట్రోల్ 100.89 రూపాయలు పలుకుతోంది. విశాఖపట్నంలో పెట్రోల్ రేటు రూ.100 మార్క్‌కు చేరువైంది. అక్కడ రూ.99.90 పైసలుగా నమోదైంది.

Recommended Video

    Telangana రోజుకు కోటి టీకాలు ఇవ్వండి.. కేంద్రానికి Congress లేఖ !!
    Petrol, Diesel Prices again hiked on June 6 2021, check prices here

    చెన్నైలో పెట్రోల్ రూ. 96.47, డీజిల్‌ ధర రూ. 90.66, కోల్‌కతలో పెట్రోల్ రూ.95.02 పైసలు, డీజిల్‌ ధర రూ.88.80 పైసలు పలుకుతోంది.
    బెంగళూరులో పెట్రోల్-98.20, డీజిల్-91.12, పాట్నాలో పెట్రోల్-97.18, డీజిల్ 91.24, చండీగఢ్‌లో పెట్రోల్-91.40, డీజిల్-84.85, లక్నోలో పెట్రోల్-91.41, డీజిల్-85.28గా నమోదైంది. భోపాల్‌లో పెట్రోల్-103.17 రూపాయలకు చేరింది. జైపూర్‌లో పెట్రోల్ రేటు 101.59 రూపాయలు పలుకుతోంది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధ‌ర 98.48, డీజిల్ 93.38 రూపాయలకు చేరింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+