హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దసరా ఊరట: తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా పెరుగుతున్న పెట్రోల్‌ ధరలు విజయదశమి పండుగ సందర్భంగా కొద్దిగా తగ్గి ఉపశమనం కలిగించాయి. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం పెట్రోల్‌పై 21 పైసలు, డీజిల్‌పై 11 పైసలు తగ్గాయి. దీంతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.82.62 గా ఉండగా.. డీజిల్‌ ధర రూ.75.58గా ఉంది.

మెట్రో నగరాలైన ముంబై, చెన్నై, కోల్‌కతా ప్రాంతాల్లో పెట్రోల్‌పై 21పైసలు, డీజిల్‌పై 11 పైసలు తగ్గించినట్లు చమురు మార్కెటింగ్‌ కంపెనీలు వెల్లడించాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోల్‌పై 21పైసలు తగ్గడంతో లీటర్‌ ధర రూ.88.08గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 22పైసలు తగ్గగా, డీజిల్‌పై 12పైసలు తగ్గింది.

Petrol, diesel prices fall 21 paise and 11 paise in Mumbai, Delhi, Kolkata

ఇక కోల్‌కతాలో రూ.84.44, చెన్నైలో రూ.85.88గా ఉంది. డీజిల్‌ ధర ముంబైలో రూ.79.35, కోల్‌కతాలో రూ.77.54, చెన్నైలో రూ.79.93కు చేరింది. పెట్రోల్‌ ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాన్ని తగ్గించాల్సిందిగా డిమాండ్‌ చేస్తూ ఢిల్లీ పెట్రోల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ ఒక రోజు పాటు సమ్మె చేయనున్నట్లు ప్రకటించింది. అక్టోబరు 22 ఉదయం ఆరు గంటల నుంచి అక్టోబరు 23 ఉదయం ఐదు గంటల వరకు సమ్మె చేస్తామని తెలిపింది.

English summary
vThe revised price for the two fuels in the city now stands at Rs 88.08 per litre and Rs 79.24 per litre, respectively, according to Indian Oil Corporation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X