డీజిల్‌పై కనికరం: పెట్రోల్‌పై మళ్లీ వాత: అత్యధిక వ్యాట్ వసూలు చేసే టాప్-5 రాష్ట్రాలివే
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. ఇంధన రేట్ల పెంపుదల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థలు మరోసారి కొరడా ఝుళిపించాయి. తాజాగా చోటు చేసుకున్న పెంపుదలలో డీజిల్‌ను మినహాయింపునిచ్చాయి. పెట్రోల్ ధరలను మాత్రమే పెంచాయి ఆయిల్ కంపెనీలు. రోజూ పెరుగుతోన్న ధరలతో దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో పెట్రోల్ రేటు లీటర్ ఒక్కింటికి 110 రూపాయలకు చేరువ అవుతోంది. శ్రీగంగానగర్‌లో పెట్రోల్ ఈ మార్క్‌ను దాటేసింది కూడా. దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 100 రూపాయలకు చేరువ అయింది. ఇంకొక్క సారి ఇంధన ధరలు పెరిగితే- వంద రూపాయల క్లబ్‌లో ఢిల్లీ చేరుతుంది.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తాజాగా చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్‌పై 31 నుంచి 39 పైసల మేర పెరిగింది. దీనితో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ రూ.99.86 పైసలకు చేరింది. డీజిల్ రేట్లల్లో మార్పు లేదు. 89.36 పైసలుగా ఆదివారం నాటి రేటే కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రేటు 106 రూపాయలకు చేరువ అవుతోంది. లీటర్ ఒక్కింటికి రూ.105.92 పైసలు పలుకుతోంది. అక్కడ డీజిల్ ధర 96.91. చెన్నైలో పెట్రోల్ రూ.100.78, డీజిల్ ధర రూ.93.94 పైసలుగా నమోదైంది. తాజా పెంపుతో కోల్‌కతలో పెట్రోల్ ధర రూ.99.84 పైసలుగా నమోదైంది. డీజిల్ ధర రూ.92.27గా ఉంటోంది.

వరుసగా చోటు చేసుకుంటోన్న ఇంధన ధరల పెంపుదలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ రేటు 105 రూపాయలకు పైగా పలుకుతోంది. డీజిల్ 100 రూపాయల మార్క్‌ను అందుకుంటోంది. దేశంలో పెట్రోల్, డీజిల్‌పై అత్యధికంగా విలువ ఆధారిత పన్నును వసూలు చేస్తోన్న రాష్ట్రాల్లో రాజస్థాన్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. దాని తరువాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ ఉన్నాయి. ఈ అయిదింటితో పాటు కర్ణాటక, జమ్ము కాశ్మీర్, ఒడిశా, తమిళనాడు, కేరళ, బిహార్, పంజాబ్, లఢక్, సిక్కింలల్లో పెట్రోల్ రేటు వంద రూపాయలకు పైమాటే. ఇక ఇంకా వంద రూపాయలను అందుకోని ఢిల్లీ, కోల్‌కత.. ఆ మార్క్‌కు చేరువ అయ్యాయి.












Click it and Unblock the Notifications