పెరుగుదలకు బ్రేక్: నేడు స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు భుధవారం స్థిరంగా ఉన్నాయి. మంగళవారం నాడు పెరిగిన ధరలే కొనసాగుతున్నాయి. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో 12 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.83.85కి చేరింది.
డీజిల్ ధర 16 పైసలు పెరిగి రూ.75.25కి చేరింది. ఇక వాణిజ్య రాజధాని ముంబైలోనూ లీటర్ పెట్రోలు ధర 12 పైసలు పెరిగి రూ.91.20 గా నమోదైంది. డీజిల్ ధర 17 పైసలు పెరిగి 79.89కి చేరింది.

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.88.90, డీజిల్ ధర రూ.81.85గా ఉంది.
కాగా, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు (0.35%) పెరిగాయి. ప్రస్తుతం ముడిచమురు ధర బ్యారెల్‌కు 85 డాలర్లు పలుకుతోంది.












Click it and Unblock the Notifications