ఎనిమిదో రోజూ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు: మొత్తంగా ఎంత తగ్గిందంటే?
న్యూఢిల్లీ: ఇటీవల భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా ఎనిమిదో రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. అయితే, బుధవారం కూడా స్వల్పంగా ధరలు తగ్గాయి. బుధవారం నాడు పెట్రోల్‌పై 11 పైసలు, డీజిల్‌పై 8 పైసలు తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
బుధవారం ఉదయం 6గంటల నుంచే ఈ తగ్గింపు ధరలు అమల్లోకి వచ్చాయి. తాజా తగ్గింపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.77.72గా ఉంది. ఇక ముంబైలో రూ.85.54, కోల్‌కతాలో రూ. 80.37, చెన్నైలో రూ.80.68గా ఉంది.

లీటర్ డీజిల్ ధర ఢిల్లీలో రూ.68.80 కాగా, ముంబైలో రూ. 73.25, కోల్‌కతాలో రూ. 71.35, చెన్నైలో రూ. 72.64గా ఉంది. వరుసగా ఎనిమిదిరోజు కూడా తగ్గుదల నమోదు చేయడంతో మొత్తంగా లీటర్ పెట్రోల్ ధరపై 71పైసలు, ఏడు రోజుల్లో రూ.53పైసలు డీజిల్‌పై తగ్గాయి.












Click it and Unblock the Notifications